
ఇబ్బందుల మధ్యనే..
లక్ష్మణచాంద: మండలంలోని పలు ప్రాథమిక పాఠశాలల భవనాలు శిథిలావస్థకు చేరాయి. మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలను విజిట్ చేయగా ఇక్కడ ఒక తరగతి ఇండోర్ షటిల్ కోర్టులో నిర్వహిస్తుండగా, మూడు తరగతులు అసంపూర్తి భవనంలో నిర్వహిస్తున్నారు. ఉన్న గదులు శిథిలావస్థకు చేరి వర్షంకు ఉరుస్తాయని ఉన్నతాధికారుల ఆదేశాలే మేరకు అందులో తరగతులు నిర్వహించడం లేదని ఉపాధ్యాయులు తెలిపారు. పొట్టపెల్లి ప్రాథమిక పాఠశాల భవనం కూడా శిథాలావస్థకు చేరడంతో పై కప్పు రేకులకు రంద్రాలు పడ్డాయి.
అసంపూర్తి భవనంలో తరగతులు