
డయేరియాపై యుద్ధం
● 45 రోజుల ప్రత్యేక కార్యక్రమాలు ● జిల్లాలో 73,715 మంది చిన్నారులకు ఓఆర్‌ఎస్, జింక్ మాత్రలు
పక్కా ప్రణాళికతో..
జిల్లాలో గుర్తించిన 5 ఏళ్ల లోపు చిన్నారులందరికీ ఓఆర్‌ఎస్, జింక్ మాత్రలు అందిస్తాం. 45 రోజులపాటు సాగే ఈ కార్యక్రమం విజయవంతమయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేశాం. ఏ ఒక్కరూ డయేరియాతో మృతి చెందొద్దనే లక్ష్యంతో కృషిచేస్తున్నాం. – డాక్టర్ నైనారెడ్డి,
జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి
నిర్మల్‌చైన్‌గేట్: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఇంటెన్సిఫైడ్ డయేరియల్ కంట్రోల్ ఫోర్ట్‌నైట్ (ఐడీసీఎఫ్) కార్యక్రమం ఈనెల 16న ప్రారంభమై, వచ్చే నెల 31 వరకు 45 రోజులపాటు జరగనుంది. 5 ఏళ్ల చిన్నారుల్లో నీళ్ల విరేచనాల నియంత్రణ లక్ష్యంగా, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, జింక్ మాత్రలు సబ్ సెంటర్లు, పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, అర్బన్ హెల్త్ సెంటర్లు, జిల్లా ఆస్పత్రుల ద్వారా పంపిణీ చేస్తారు. గ్రామస్థాయిలో ఆశ, ఏఎన్‌ఎం, అంగన్‌వాడీ కార్యకర్తల సమన్వయంతో ప్రతీ చిన్నారికి ఈ సదుపా యం అందిస్తారు. వర్షాకాలంలో డయేరియా ప్రభా వం పెరగడంతో, ఓఆర్‌ఎస్ ద్రావణంతో శరీరంలో కోల్పోయిన ఎలక్ట్రోలైట్స్‌ను పునరుద్ధరిస్తారు.
చిన్నారుల గుర్తింపు
జిల్లాలో 1,88,929 కుటుంబాల సర్వేలో 5 ఏళ్లలో పు 73,715 మంది చిన్నారులను గుర్తించారు. 160 ఏఎన్‌ఎంలు, 568 ఆశ కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది వారికి ఓఆర్‌ఎస్, జింక్ మాత్రలు ఇస్తారు.
జింక్ మాత్రల ప్రయోజనాలు
జింక్ మాత్రలు డయేరియా సంఖ్యను తగ్గించి, రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. 14 రోజుల వినియోగంతో నీళ్ల విరేచనాలు, న్యూమోనియా నివారణ సాధ్యమవుతుంది. డయేరియా వల్ల చిన్నారులు నీరసించకుండా, 13 లక్షల ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, 38,429 జింక్ మాత్రలను సిద్ధం చేశారు. ఇటుక బట్టీలు, సంచార జాతుల ప్రాంతాల్లో వాహనాల ద్వారా సేవలు అందిస్తారు