
బీడీ పరిశ్రమపై ఆంక్షలు ఎత్తివేయాలి
సోన్: బీడీ పరిశ్రమపై కేంద్ర ప్రభుత్వం విధించిన కోట్ప చట్టాన్ని రద్దు చేయాలని టీయూసీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రాజన్న డిమాండ్ చేశారు. ఈనెల 21, 22న నిజామాబాద్‌లో నిర్వహించే టీయూసీఐ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని కోరారు. సోన్ మండలం జాఫ్రాపూర్‌లో ఏర్పాటుచేసిన జనరల్ బాడీ సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో బీడీ పరిశ్రమతో ఏడు లక్షల మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ చర్యలతో వీరికి ఉపాధి కరువవుతోందని అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న జీవన భృతి ప్రకారం కేంద్ర ప్రభుత్వం కూడా జీవన భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీడీ కార్మికులకు కనీస పెన్షన్ రూ.9 వేలు ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో ప్రగతిశీల మహిళా సంఘం(పీవోడబ్ల్యూ)జిల్లా కార్యదర్శి కె.లక్ష్మి. ఎ.నవీన్, జమున, లక్ష్మి, విజయ, గంగమణి తదితరులు పాల్గొన్నారు.