
పనులు నిలిపివేశారు....
సారంగపూర్: మండలంలోని జామ్ ఉన్నత పాఠశాలలో రూ.10 లక్షలతో చేపట్టిన డైనింగ్ హాల్ నిర్మాణ పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. రూ.3 లక్షలు ఇంకా విడుదల కాకపోవడంతో సదరు కాంట్రాక్టరు పనులను నిలిపివేశారు. దీంతో విద్యార్థులు ఆరుబయట భోజనాలు చేసే పరిస్థితి. జామ్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాల ఆవరణలో 50 లక్షలతో ఇటీవలే నూతన భవనం నిర్మించారు. పాతభవనం కూలడానికి సిద్ధంగా ఉంది. మంచినీళ్ల ట్యాంకు కోసం దానిని అలాగే ఉంచేశారు. అది కూలిపోతే పెను ప్రమాదం సంభవించే అవకాశాలున్నాయి.
భైంసాటౌన్: పట్టణంలోని మదీనాకాలనీలోగల ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ఇంగ్లిష్, ఉర్దూ మీడియం తరగతులు నిర్వహిస్తున్నారు. 265 వరకు విద్యార్థులు ఉన్నారు. పది తరగతి గదులు అవసరం. ఐదు గదులే అందుబాటులో ఉన్నాయి. మన ఊరు–మన బడి పనులు మధ్యలో నిలిచాయి.
ఒకే గదిలో ఐదు తరగతులు..
కడెం: మండలంలోని ఉడుంపూర్ జీపీ పరిధి గండిగోపాల్‌పూర్ ప్రాథమిక పాఠశాలలో 23 మంది విద్యార్థ్దులు, ఇద్దరు టీచర్లున్నారు. ఐదు తరగతులు ఒకే గదిలో కొనసాగుతున్నాయి. అదనపు గదులు అసంపూర్తిగా ఉన్నాయి.
తరగతులు సరిపోక..