
స్లాబ్ కిందే చదువులు
భైంసారూరల్: మండలంలోని కుంసర ప్రాథమిక పాఠశాల విద్యార్థులు స్లాబ్ కిందే పాఠాలు నేర్చుకుంటున్నారు. మన ఊరు మన బడిలో నూతన భవన నిర్మాణానికి రూ.45 లక్షలు మంజూరు చేశారు. మూడేళ్ల క్రితం స్లాబ్ వేశారు. ఏళ్లు గడుస్తున్న చుట్టు గోడలు నిర్మించలేదు. రోడ్డుపై వెళ్లే వాహనాల శబ్దంతో విద్యార్థులు పాఠాలు వినలేకపోతున్నారు. ఈ పాఠశాలలో ముగ్గురు ఉపాధ్యాయులు, 45 మంది విద్యార్థులు ఉన్నారు. మాంజ్రి ప్రాథమిక పాఠశాల భవనానికి తలుపులు కిటికీలు లేవు. ఈ పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు 50 మంది విద్యార్థులు ఉన్నారు.