
అభివృద్ధి పనులకు శంకుస్థాపన
సోన్: మండల కేంద్రంతోపాటు సిద్ధులకుంట, మాదాపూర్, సంఘంపేట్, న్యూవెల్మల్ గ్రా మాలలో ఇందిరమ్మ ఇళ్లు, సీసీ రోడ్ల నిర్మాణ పనులకు బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి మంగళవారం భూమిపూజ చేశారు. వివిధ గ్రామాలలోని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదా రులకు మంజూరు పత్రాలు అందించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం, రాష్ట్ర ప్రభు త్వ నిధుల ద్వారా ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నట్లు తెలిపారు. అనంతరం న్యూవెల్మల్ గ్రామంలో వీడీసీ సభ్యులు ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో డీవో రాజేశ్వర్, డీఈ తుకారం, ఎంపీడీవో సురేశ్, మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్‌రెడ్డి, నాయకులు సత్యనారాయణగౌడ్, గంగన్న, మండల అధ్యక్షుడు గంగారెడ్డి, మహిపాల్‌రెడ్డి, విజయ, సాగర్, బీడీసీ చైర్మన్ వేణు పాల్గొన్నారు.