చెన్నైలో వైఎస్‌ జగన్‌ పర్యటన | YSRCP Chief YS Jagan Visiting Chennai Receives Grand Welcome From Fans, Know His Chennai Visit Reason | Sakshi
Sakshi News home page

చెన్నైలో వైఎస్‌ జగన్‌ పర్యటన

Aug 29 2025 3:37 AM | Updated on Aug 29 2025 10:32 AM

YS Jagan visiting chennai

సోదరుడు సునీల్‌ రెడ్డి కుమారుడి నిశ్చితార్థ వేడుకలో మాజీ సీఎం వైఎస్‌ జగన్‌

ఘనస్వాగతం పలికిన అభిమానులు

సాక్షి, చెన్నై: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం చెన్నై పర్యటనకు వచ్చారు. ఆయనకు విమానాశ్రయంలో వైఎస్సార్‌ సేవాదళ్‌ తమిళనాడు అధ్యక్షుడు ఏకే జాహీర్‌ హుస్సేన్‌ తదితరులు ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయం ఆవరణలో పార్టీ వర్గాల అభివాదాలు అందుకున్న అనంతరం సతీమణి వైఎస్‌ భారతి రెడ్డి, సోదరుడు అనిల్‌రెడ్డితో కలిసి వైఎస్‌ జగన్‌ చెన్నై బోట్‌ క్లబ్‌ రోడ్డుకు వెళ్లారు. మార్గమధ్యంలో  ఆయనకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఆయన కాన్వాయ్‌తో కలిసి ముందుకు సాగారు.

బోట్‌ క్లబ్‌ రోడ్డులోని ఇండియా సిమెంట్స్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ శ్రీనివాసన్‌ నివాసానికి వెళ్లారు. అనంతరం ఇంజంబాక్కంలోని వీజీపీ లే అవుట్‌ లోని వైఎస్‌ అనిల్‌ రెడ్డి నివాసానికి వెళ్లారు. ఇక్కడికి కూడా అభిమానులు తరలిరావడంతో స్థానిక పోలీసులు వారిని కట్టడి చేశారు. సాయంత్రం తేనాంపేటలో సోదరుడు వైఎస్‌ సునీల్‌ రెడ్డి కుమారుడు నిశ్చితార్థ వేడుకకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. రాత్రి ఇంజంబాక్కంలో బస చేశారు. శుక్రవారం ఉదయం ఉత్తండిలో సునీల్‌ రెడ్డి నివాసంలో జరిగే కుటుంబ కార్యక్రమానికి జగన్‌ హాజరుకానున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement