ఫైర్‌ లేడీ.. నిప్పు రవ్వలను మిఠాయిల్లా మింగేస్తోంది

Woman Swallows Fire Balls Netizens Link Video Corona Cure Viral - Sakshi

సాధారణంగా నిప్పుతో ఎవరైనా చలి కాచుకుంటారు కానీ ఈ మహిళ నిప్పురవ్వలను మిఠాయిలు మింగినట్లు మింగేస్తుంది. అసలు ఇది సాహసమో లేక ఆకలేసి ఇలా తింటోందా అని చూసినవారంతా వ్యంగ్యంగా కామెంట్లు పెడుతున్నారు. కరోనాను ఎలా తగ్గించుకోవాలి అనే అంశంపై ఇటీవల సోషల్ మీడియాలో చాలా మంది చాలా రకాలుగా చెబుతున్నారు. ఈ మహిళ అవన్నీ చేసి చివరకు ఇలా వేడి వేడి నిప్పు రవ్వలను నోట్లో వేసుకొని లాగించేస్తోందని క్యాప్షెన్‌ పెట్టి ఈ వీడియోను ఓ ఐపీఎస్‌ అధికారి తన ట్విటర్‌లో పోస్ట్‌ చేశాడు.

వివరాల్లోకి వెళితే..  కుర్చీలో తాపీగా కూర్చున్న ఓ మహిళ.. తన ఎదురుగా ఉన్న టేబుల్‌పైన ప్లేటులోని వెలుగుతున్న నిప్పురవ్వలు ఉంచుకుంది. మొదట చూసిన వారంతా ఆ మహిళ ఏదైనా వంట చేస్తుందేమో అనుకున్నారు. కానీ అందరినీ ఆశ్చర్యపరుస్తు వాటిలోని నిప్పు రవ్వలను ఒక్కొక్కటీ నోట్లో వేసుకోవడం మొదలుపెట్టింది. ఈ వీడియోని ఐపీఎస్‌ ఆఫీసర్ రూపిన్ శర్మ తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఆమె ఫైర్ బాల్స్ మింగుతున్నప్పుడు సినిమాల్లో లాగా ఓ మ్యూజిక్‌ను కూడా జోడించారు. ప్రస్తుతం ఈ  వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. మీరు మాత్రం ఇలాంటివి ట్రై చేయకండి అని నిపుణులు అంటున్నారు.

( చదవండి: ప్లీజ్‌..!అలా కొరక్కే అందరు మనవైపే చూస్తున్నారు )

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top