 
													ఒకప్పుడు పెళ్లి అంటే పెళ్లికూతురు సిగ్గు పడుతూ వచ్చి పీటలమీద తల వంచుకుని కూర్చుని తాళి కట్టించుకునేవారు. అకానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. పెళ్లిలో హడావిడి అంతా వధువు చేతుల్లోనే ఉంటుంది. తన పెళ్లిని జీవితాంతం గుర్తిండిపోయే చాలా డిఫరెంట్‌గా ప్లాన్ చేస్తున్నారు. పెళ్లి ఎలా జరగాలో కూడా వారే నిర్ణయించుకుంటున్నారు. పెళ్లి బట్టల నుంచి జ్యువెలరీ నుంచి అన్ని వారే స్వయంగా షాపింగ్ చేస్తున్నారు. సంగీత్‌లు, మెహెందీ ఫంక్షన్లు, పెళ్లి దగ్గర డ్యాన్సులతో ఇరగదీస్తున్నారు.
చదవండి: థూ.. థూ ఉమ్ముతో హెయిర్ కటింగ్.. వైరల్ వీడియో

తాజాగా ఓ యువతి కూడా తన పెళ్లిని సరికొత్తగా ప్లాన్ చేసింది. గుర్గావ్‌కు చెందిన సబా కపూర్ అనే యువతి పెళ్లి మండపం వద్దకు వెళ్లే సమయంలో తన కుటుంబ సభ్యులతో కలిసి ఉత్సాహంగా డ్యాన్స్ చేసింది. గ్రే కలర్ లెహంగా ధరించి కత్రినా కైఫ్, సిద్ధార్త్ మల్హోత్రా కలిసి నటించిన బార్‌బార్ దేఖో సినిమాలోని సా ఆస్‌మానోకో అనే పాటకు ఎనర్జిటిక్ స్టెప్పులతో అదరగొట్టింది. అందరితో డ్యాన్స్ చేస్తూ చివరకు పెళ్లి కొడుకు దగ్గరకు చేరుకొని మోకరిల్లి అతడికి రింగ్ ఇచ్చి ప్రపోజ్ చేసింది.

వధువు ఇచ్చిన సినిమాటిక్ ఎంట్రీకి పెళ్లి కొడుకు ఫుల్ ఫిదా అయిపోయాడు. ఇక యువతి డ్యాన్స్ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. పెళ్లి కూతురు డ్యాన్స్ సర్‌ప్రైజ్ అదిరిందంటూ,అలాంటి అమ్మాయి భార్యగా దొరకడం వరుడి అదృష్టమని నెటిజన్‌లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
చదవండి: షాకింగ్ వీడియో: డ్యూటీకి డుమ్మా కొట్టిన నర్సు.. మరునాడు ఆస్పత్రికి వెళ్లగా
If my entire family doesn’t recreate this on my hypothetical wedding, I will die a sad brown girl. pic.twitter.com/8y3b5pLU3g
— harram (@diaryofashrimp) December 25, 2021

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
