జర్నలిస్టుల కోసం సుప్రీంకోర్టు ప్రత్యేక యాప్‌

Supreme Court New App Journalists Court Proceedings Corona - Sakshi

న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో సమావేశాలను జూమ్‌లో, విద్యార్థులకు చదువులు ఆన్‌లైన్‌లో..ఇలా ప్రతీది ఆన్‌లైన్‌ బాటలో నడుస్తున్నాయి. ఈ క్రమంలో సుప్రీంకోర్టు వర్చువల్‌ విధానంలో విచారణలు జరుపుతుండగా...జర్నలిస్టుల కోసం కూడా ఓ ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ యాప్‌ను సీజేఐ జస్టీస్‌ ఎన్‌.వి.రమణ ప్రారంభించారు. యాప్‌ ప్రారంభం అనంతరం ఆయన మాట్లాడుతూ..  ఇది జర్నలిస్టులకు ఎంతో ఉపయోగపడనుందని గతంలోను ఓ జర్నలిస్టుగా బస్సులో తిరుగుతూ వార్తలు సేకరించిన రోజులు గుర్తున్నాయని సీజేఐ ఈ సందర్భంగా అన్నారు.

సుప్రీం కోర్టు విచారణలను జర్నలిస్టులకు మరింత అందుబాటులోకి తీసుకురావడానికి సుప్రీంకోర్టు ఇ-కమిటీ చొరవతో ఈ యాప్‌ని విడుదలు చేస్తున్నామని భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి రమణ అన్నారు. కోర్టు విచారణలు ప్రత్యక్ష ప్రసారం చేసే దిశగా ప్రయత్నాలు చేస్తామని ఆయన అన్నారు. కోర్టు ప్రత్యక్ష కార్యకలాపాలను ప్రసారం చేసేలా ఓ ట్రయల్‌ ప్రతిపాదనను కూడా సుప్రీంకోర్టు పరిశీలిస్తోందని తెలిపారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో కోర్టు విచారణలను పలువురు జర్నలిస్టులు  వర్చువల్‌ ద్వారా జరపాలని కోరిన తరువాత యాప్‌ను రూపొందించారు. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల ఈ యాప్‌ కోసం గూగుల్ ప్లే స్టోర్‌లోని యాప్ ద్వారా విచారణలను ప్రత్యక్షంగా హాజరయ్యే వీలు కల్పించనున్నారు.

( చదవండి: కోవిడ్‌ మరణాల్లో మరో రికార్డు )

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top