
సాక్షి, న్యూడిల్లీ: రవీంద్రనాథ్ ఠాగూర్ భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూకు రాసిన లేఖను లోక్‌సభ సభ్యులు శశిథరూర్ శనివారం పంచుకున్నారు. నెహ్రూ బయోపిక్ తనని ఎంతగానో ఆకట్టుకుందంటూ ఠాగూర్ తన చేతితో రాసిన లేఖను శనివారం ట్విటర్ షేర్ చేసి నాటి జ్ఞాపకాలను మరోసారి గుర్తు చేశారు. 1936 ఠాగూర్ తన చేతితో రాసిన లేఖ అని ఎంపీ తన పోస్టులో వెల్లడించారు. ‘1936లో నెహ్రూ ఆత్మకథ చదివిన తరువాత గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్, పండిట్ నెహ్రూకు ఇచ్చిన అసాధారమైన గమనిక ఇది’ అని ట్విటర్‌లో థరూర్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ లేఖ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ పోస్టుకు ఇప్పటి వరకు దాదాపు 7 వేలకు పైగా లైక్‌లు, వందల్లో కామెంట్స్ వచ్చాయి. ఎంపీ పోస్టుకు నెటిజన్లు ఫిదా అవుతూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. నాటి మధుర జ్ఞాపకాన్ని పంచుకున్నందుకు థరూర్‌కు నెటిజన్లు ధన్యవాదాలు తెలుపుతున్నారు.
ఠాగూర్ రాసిన కొన్ని కవితలలోని ఫేమస్ కొట్స్ షేర్ చేస్తున్నారు. ‘ఈ రోజు వరకు ప్రపంచంలోని అత్యంత తెలివైన అసాధారమైన వ్యక్తి ఠాగుర్’, ‘అందుకే ఠాగూర్ మాటలలో, పనులలో మాస్టర్’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ‘‘ప్రియమైన జవహర్‌లాల్, నేను మీ గొప్ప ఆత్మకథ పుస్తకాన్ని చదవడం ముగించాను. మీ విజయానికి నేను మంత్రముగ్థుడినయ్యాను. అది నన్ను చాలా ఆకట్టుకుంది. అంతేగాక మిమ్మల్ని చూసి గర్వపడుతున్నాను. మానవత్వపు లోతైన భావాల వైపు ఈ పుస్తకం నడిపిస్తుంది. ఇది వాస్తవాల చిక్కులను అధిగమించి మమ్మల్ని గొప్ప వ్యక్తి వైపుకు నడిపిస్తుంది. మీ రవీంద్రనాథ్ ఠాగూర్’’ అంటూ ఠాగూర్ రాసుకొచ్చిన ఈ లేఖ మే 31, 1936 నాటిదని ఎంపీ పేర్కొన్నారు.
This was Gurudev Rabindranath Tagore’s note to Pandit Nehru after reading his autobiography in 1936. Extraordinary and exquisite. pic.twitter.com/46PtaVJixG
— Shashi Tharoor (@ShashiTharoor) July 30, 2020