సుప్రీంకోర్టు జడ్జికి గుండెపోటు.. బాగానే ఉన్నానంటూ మెసేజ్‌

SC Judge MR Shah Flown To Delhi After Heart Attack - Sakshi

ఢిల్లీ: సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎంఆర్‌ షా గుండెపోటుకు గురయ్యారు. హిమాచల్‌ ప్రదేశ్‌ పర్యటనలో ఉండగా.. గురువారం ఆయన అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ని ఎయిర్‌ ఆంబులెన్స్‌లో ఢిల్లీకి తరలించారు. 

షా అస్వస్థత వార్త తెలియగానే.. సుప్రీంకోర్టు అధికార వర్గాలు హోం​ మంత్రిత్వ శాఖతో సంప్రదించి ఎయిర్‌ఆంబులెన్స్‌లో హుటాహుటిన తరలించాయి. అయితే తాను బాగానే ఉన్నానని, రేపో ఎల్లుండో పూర్తిగా కోలుకుంటానని ఆయన చెప్తుండగా..  ఓ షార్ట్‌ వీడియో బయటకు వచ్చింది.

జస్టిస్‌ షా గతంలో గుజరాత్‌ హైకోర్టు జడ్జిగానూ పని చేశారు. ఆపై పాట్నా హైకోర్టు సీజేగా విధులు నిర్వహించారు. 2018లో ఆయన్ని సుప్రీంకోర్టుకు ప్రమోట్‌ చేశారు. మే 15, 2023న ఆయన రిటైర్‌ కావాల్సి ఉంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top