Salman Khan Meet Mamata Banerjee At Her Residence - Sakshi
Sakshi News home page

వీడియో: దీదీ ఇంటికి సల్లూ భాయ్‌

May 13 2023 8:33 PM | Updated on May 13 2023 8:46 PM

Salman Khan Meet Mamata Banerjee At Her Residence - Sakshi

కాళిఘాట్‌లోకి మమతా బెనర్జీ ఇంటికి సల్మాన్‌ రావడంతో..

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో ఇవాళ ఒక ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. బాలీవుడ్‌ ప్రముఖ నటుడు సల్మాన్‌ ఖాన్‌, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కలిశారు. శనివారం సాయంత్రం కాళిఘాట్‌లో ఉన్న దీదీ నివాసానికి వెళ్లాడు సల్మాన్‌ భాయ్‌.

సల్మాన్‌ రాక విషయం తెలుసుకున్న స్థానికులు భారీగా అక్కడికి చేరుకున్నారు. నివాసం బయటకు వచ్చి మరీ శాలువా కప్పి ఇంట్లోకి సల్మాన్‌ను ఆహ్వానించారామె. దాదాపు అరగంట వీళ్లిద్దరూ చర్చించుకున్నారు.  

ఈస్ట్‌ బెంగాల్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ శతాబ్ధి ఉత్సవాల కోసం అక్కడికి వెళ్లిన సల్మాన్‌.. మమతా బెనర్జీతో మర్యాదపూర్వకంగా భేటీ అయినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. సల్మాన్‌ రాక నేపథ్యంలో ఆయన బస చేసిన హోటల్‌ వద్ద గట్టి భద్రత ఏర్పాటు చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement