జూలై 4 నుంచి రేషన్‌ డీలర్ల నిరసనబాట

Ration Dealers To Go On Strike From July 4 in Nationwide - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : రేషన్‌ డీలర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ దేశవ్యాప్త ఉద్యమం చేపట్టనున్నట్లు జాతీయ రేషన్‌ డీలర్ల ఫెడరేషన్‌ ఉపాధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు నాయికోటి రాజు తెలిపారు. గురువారం ఢిల్లీలో జరిగిన ఫెడరేషన్‌ కార్యవర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.  

కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ‘వన్‌ నేషన్‌–వన్‌ కమీషన్‌’ విధానంలో ప్రతి క్వింటాల్‌కు కమీషన్‌ను రూ.250 నుంచి రూ.300కు పెంచాలని డిమాండ్‌ చేశారు. రేషన్‌ డీలర్ల సమస్యల పరిష్కారం కోసం జూలై 4న మండల కేంద్రాల్లో, జూలై 11న జిల్లా కేంద్రాల్లో, జూలై 18న రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర రాజధానుల్లో ఆందోళనలు నిర్వహించాలని తీర్మానించారు. ఆగస్ట్‌ 2న దేశవ్యాప్తంగా ఉన్న ఐదు లక్షల మంది డీలర్లతో ఢిల్లీలో పార్లమెంట్‌ మార్చ్‌ నిర్వహించనున్నట్లు రాజు పేర్కొన్నారు. (క్లిక్‌:  జూన్‌ 26న జాతీయ లోక్‌ అదాలత్‌)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top