Viral Video: టీటీ వర్సెస్‌ పోలీస్‌: ట్రైన్‌ ఏమి ఎవరి అబ్బ సొత్తు కాదు!

UP Polices Intimidation Backfires As TTE Question Ticketless Train Tave; - Sakshi

రైలులో టిక్కెట్‌ లేకుండా ప్రయాణిస్తున్న ఓ పోలీసు బృందం పట్టుబడింది. టిక్కెట్‌ కలెక్టర్‌ తనిఖీ చేయడానికి వస్తూ..వారిని టిక్కెట్‌ చూపించమని అడగగా.. బెదిరింపులకు దిగారు. దాదాగిరి చేసే ప్రయత్నం చేశారు.  ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఓ రైలులో చోటు చేసుకుంది. అక్కడ ఉన్న ప్రయాణికులను బెదిరించి మరీ ఈ పోలీసు బృందం కూర్చొన్నారు. ఐతే ఇంతలో టిక్కెట్‌ కలెక్టర్‌ వచ్చి టిక్కెట్లు గురించి ప్రశ్నించడంతో అసలు విషయం బయటపడింది.

ఆ పోలీసు బృందం టిక్కెట్‌ లేకుండా ప్రయాణించడమే కాకుండా ప్రయాణికుల సీట్లను ఆక్రమించారు. దీంతో టిక్కెట్‌ కలెక్టర్‌ వారిని ఈ విషయమై నిలదీయగా..రకరకాలుగా బెదిరింపులకు దిగడం, దాదాగిరి చేయడం వంటివి చేశారు. ఐతే టీటీ కూడా ఏమాత్రం తగ్గకుండా వారిని ఆయా సీట్ల నుంచి ఖాళీ చేయించాడు. దాదాగిరి చేసేందుకు రైలు ఏమి ఎవరి అబ్బ సొత్తు కాదని కుండబద్ధలు కొట్టినట్లు చెప్పాడు.

దీంతో ఆ పోలీసులు ఇక చేసేది లేక అలా నుంచునే ఉన్నారు. ఎక్కడపడితే అక్కడ పవర్‌ ఉపయోగించడం కుదరదు. అది కూడా నిజాయితీగా తమ డ్యూటీని నిర్వర్తించే వారి వద్ద అస్సలు కుదరదు.  అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్‌చల్‌ చేస్తోంది. ఐతే ఈ విషయంపై స్పందించిన సంబంధిత రైల్వే పోలీసులు ఈ ఘటనపై చర్యలు తీసుకునేలా సంబంధిత అధికారులకు నివేదించినట్లు తెలిపారు.

(చదవండి: భవనంపై నుంచి పడి ఎయిర్‌హోస్ట్‌ మృతి.. బాయ్‌ఫ్రెండ్‌ అరెస్ట్‌)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top