‘మామిడి’ వివాదం | pmk founder ramadoss files case over party name symbol dispute | Sakshi
Sakshi News home page

‘మామిడి’ వివాదం

Mar 25 2026 11:20 AM | Updated on Mar 25 2026 11:20 AM

pmk founder ramadoss files case over party name symbol dispute

– రామన్న న్యాయ పోరాటం

సాక్షి, చైన్నె: పార్టీ పేరు, జెండా, మామిడి పండు గుర్తుపై హక్కుల కోసం పీఎంకే వ్యవస్థాపకుడు రాందాసుచైన్నె సివిల్‌ కోర్టును మంగళవారం ఆశ్రయించారు. ఈ వివాదంపై ఇటీవల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ నేతృత్వంలోని బెంచ్‌ విచారణ చేపట్టింది. పార్టీలో చీలిక వచ్చినప్పుడు గుర్తును కేటాయించే విష యంలో ఎన్నికల సంఘం తీరును కోర్టు తప్పుబట్టింది. ఈ వ్యవహారంపై తక్షణమే చైన్నె సివిల్‌ కోర్టును ఆశ్రయించాలని రాందాసును ఆదేశించింది. సివిల్‌ కోర్టు పిటిషన్‌ను స్వీకరించిన మూడు రోజుల్లో తుది నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

నేడు విచారణ..
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాందాసు తరపు న్యాయవాదులు చైన్నె సివిల్‌ కోర్టు న్యాయమూర్తి ఎం. ధర్మప్రభు ముందు అప్పీల్‌ చేశారు. రాందాసు తరపున దాఖలు చేసిన పిటిషన్‌ను బుధవారం విచారించేందుకు న్యాయమూర్తి నిర్ణయించారు. అలాగే ఈ పిటిషన్‌ కాపిని అన్బుమణి వర్గానికి అందజేయాలని కోర్టు ఆదేశించింది. కాగా తమ విషయంలో ఎన్నికల సంఘం ఈ విషయంలో పారదర్శకంగా వ్యవహరించలేదని రాందాసు మద్దతు దారులు ఆరోపిస్తున్నారు.

వివాద నేపథ్యం
పీఎంకే పార్టీపై ఆధిపత్యం కోసం తండ్రి రాందాసు, తనయుడు అన్బుమణి మధ్య గత కొంతకాలంగా విభేదాలు నడుస్తున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం ’మామిడి పండు’ గుర్తును అన్బుమణి వర్గానికి కేటాయించింది. పార్టీలో అంతర్గత సమస్యలు ఉన్నప్పుడు గుర్తును స్తంభింపజేయాలి లేదా లాటరీ పద్ధతిలో కేటాయించాలే గానీ, ఏక పక్షంగా అన్బుమణికి ఇవ్వడం సరైన పద్ధతి కాదంటూ రాందాసు కోర్టు తలుపు తట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement