Nigerias Wodaabe Tribe Facts: పళ్లను చూసి పెళ్లాడేస్తారు...

men do makeup to attract women in nigerias - Sakshi

గిరిజన తెగలలో జరిగే వివిధ వేడుకలు చాలా విచిత్రంగా ఉంటాయి. ముఖ్యంగా పెళ్లిపేరుతో జరిగే తంతు ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. ఇదేకోవలో నైజీరియాలోని ఒక గిరిజన తెగలో జరిగే ఒక వింత వేడుక అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. 

నైజీరియాలోని వోడబె గిరిజనులలో ప్రతీయేటా ఒక పోటీ జరుగుతుంటుంది. దీనిలో పురుషులు విచిత్రమైన మేకప్‌తో పాల్గొంటారు. అయితే వీరిని మేకప్‌ చేసే పని స్త్రీల చేతుల్లో ఉంటుంది. ఈ విధంగా ఎందుకు మేకప్‌ చేస్తారో, దీని వెనుకనున్న కారణమేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. నైజీరియాలో ఉండే వోడబె గిరిజనులు ‍ప్రతీయేటా గుయెరోవెల్‌ అనే పోటీని నిర్వహిస్తారు. ఇది పురుషుల సౌందర్యాన్ని ప్రతిబింబించే ఉత్సవం. దీనిలో ఈ గిరిజన జాతికి చెందిన స్త్రీలు, పురుషులు ఉత్సాహంగా పాల్గొంటారు. ఈ పోటీలో భాగంగా పురుషుల ముఖంపై సంప్రదాయ రీతిలో మేకప్‌ చేస్తారు.  

భాగస్వామి ఎంపిక కోసం..
మేకప్‌ చేసుకున్న పురుషులు సంప్రదాయ దుస్తులు ధరించడంతోపాటు వివిధ ఆభరణాలు కూడా ధరిస్తారు. ఈ మేకప్‌ కార్యక్రమం పూర్తయిన తరువాత పెళ్లికాని యువతులు వారిముందు నిలుచుంటారు. వారు పురుష సౌందర్యాన్ని గుర్తిస్తారు. మేకప్‌ చేసిన పురుషుల కళ్లను, దంతాలను పరిశీలిస్తారు. ఎవరి కళ్లు, దంతాలు మిలమిలా మెరుస్తాయో వారిని అత్యంత ఆకర్షణీయమైన  పురుషునిగా గుర్తిస్తారు. ఈ పోటీలో పాల్గొన్న పురుషులు తమ ఎదురుగా ఉన్న పెళ్లికాని యువతులను ఆకర్షించేందుకు వివిధ హావభావాలను పలికిస్తారు. యువతులు ఈ పురుషులలో తమకు నచ్చిన ఒకరిని తమ భాగస్వామిగా స్వీకరిస్తారు.

ఇది కూడా చదవండి: హెల్మెట్లు చాలావరకూ నలుపు రంగులోనే ఎందుకుంటాయంటే.. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top