Lockdown: వార్నీ.. కోడికి కూడా ఆ సమస్య ఉంటుందా? 

Lockdown Karnataka Man Tells Cops That His Hen Has Constipation Issues - Sakshi

బెంగళూరులో చోటు చేసుకున్న ఘటన

లాక్‌డౌన్‌లో బయట తిరుగుతున్న వ్యక్తి

కారణం తెలుసుకుని నోరు వెళ్లబెట్టిన పోలీసులు

బెంగళూరు: కరోనా కట్టడి కోసం పలు రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ విధించిన సంగతి తెలిసిందే. మహమ్మారి విజృంభిస్తున్నప్పటికి జనాలు పెద్దగా మారడం లేదు. చాలా చిన్న చిన్న, సిల్లీ కారణాలు చెప్పి రోడ్డుకు మీదకు వస్తున్నారు. కుక్కకు బాలేదని కొందరు.. ఉప్పు పప్పులు అయిపోయాయని చెప్పి మరికొందరు రోడ్ల మీద తిరుగుతున్నారు. తాజాగా లాక్‌డౌన్‌ సమయంలో రోడ్డు మీదకు వచ్చిన ఓ వ్యక్తి పోలీసులకు చెప్పిన సమాధానం నెట్టింట తెగ వైరలవుతోంది. వార్నీ కోడికి కూడా ఆ సమస్య ఉంటుందా అని ఆశ్చర్యపోతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. 

ట్విట్టర్‌ యూజర్‌ అమిత్‌ ఉపాధ్యే పోస్ట్‌ చేసిన ఈ వీడియోలోని సంఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. లాక్‌డౌన్‌ అమల్లో ఉండగా ఓ వ్యక్తి చేతిలో సంచితో రోడ్డు మీదకు వచ్చాడు. పోలీసులు అతడిని ఆపి ఎందుకు బయటకు వచ్చావని ప్రశ్నించారు.

అప్పుడు ఆ వ్యక్తి సంచిలో ఉన్న కోడిని బయటకు తీసి.. ‘‘ఇది మలబద్దకంతో బాధపడుతుంది సార్‌. దీన్ని పశువుల డాక్టర్‌ దగ్గరకు తీసుకెళ్లాలి. అందుకే బయటకు వచ్చాను’’ అన్నాడు అతడి సమాధానానికి పోలీసులు పక్కున నవ్వారు. కోడికి కూడా ఇలాంటి సమస్య ఉంటుందా అని ప్రశ్నించారు. ఆ తర్వాత అతడిని ఇంటికి తిరిగి పంపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. అతడి సృజానత్మకతను నెటిజనులు ప్రశంసిస్తున్నారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top