నూతన సీడీఎస్‌గా సుబ్రమణి  | Lieutenant General NS Raja Subramani (Retd) appointed as Chief of Defence Staff | Sakshi
Sakshi News home page

నూతన సీడీఎస్‌గా సుబ్రమణి 

May 10 2026 4:29 AM | Updated on May 10 2026 4:29 AM

Lieutenant General NS Raja Subramani (Retd) appointed as Chief of Defence Staff

న్యూఢిల్లీ:  నూతన చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌(సీడీఎస్‌)గా లెఫ్టినెంట్‌ జనరల్‌ ఎన్‌ఎస్‌ రాజా సుబ్రమణి(రిటైర్డ్‌)ని కేంద్ర ప్రభుత్వం నియమించింది. త్రివిధ దళాల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేసే బాధ్యతను ఆయనకు కట్టబెట్టింది. ప్రస్తుత సీడీఎస్‌ జనరల్‌ అనిల్‌ చౌహాన్‌ ఈ నెలలో పదవీ విరమణ చేయబోతున్నారు. ఆయన స్థానంలో రాజా సుబ్రమణి బాధ్యతలు స్వీకరిస్తారు. 

సీనియర్‌ మిలిటరీ అధికారి అయిన రాజా సుబ్రమణికి పాకిస్తాన్, చైనా సైనిక వ్యవహారాలపై అపారమైన పరిజ్ఞానం ఉంది. ఆయన గత ఏడాది జూలై 31న వైస్‌ చీఫ్‌ ఆఫ్‌ ఆర్మీ స్టాఫ్‌గా పదవీ విరమణ చేశారు. ప్రస్తుతం నేషనల్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ సెక్రెటేరియట్‌(ఎన్‌ఎస్‌సీఎస్‌)కు సైనిక సలహాదారుగా సేవలందిస్తున్నారు. కొత్త సీడీఎస్‌గా ఈ నెల 30న బాధ్యతలు చేపట్టబోతున్నారు. అంతేకాకుండా సైనిక వ్యవహారాల విభాగం కార్యదర్శిగా కూడా ఆయన పనిచేస్తారని రక్షణ శాఖ శనివారం ఒక ప్రకటనలో వెల్లడించింది.  

మూడో సీడీఎస్‌గా రికార్డు  
లెఫ్టినెంట్‌ జనరల్‌ రాజా సుబ్రమణి 40 సంవత్సరాలకు పైగా సైన్యంలో పని చేస్తున్నారు. సుదీర్ఘమైన ఉద్యోగ జీవితంలో సంక్లిష్టమైన, సంఘర్షణలతో కూడిన వేర్వేరు భౌగోళిక పరిస్థితుల్లో సేవలందించారు. అనేక కమాండ్, స్టాఫ్, బోధనా పదవులను నిర్వర్తించారు. రాజా సుబ్రమణి 1965 జూలై 21న ముంబైలో జని్మంచారు. కళాశాల విద్య పూర్తయిన తర్వాత నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ, ఇండియన్‌ మిలటరీ అకాడమీలో శిక్షణ పొందారు. యునైటెడ్‌ కింగ్‌డమ్‌లోని జాయింట్‌ సరీ్వసెస్‌ కమాండ్‌ స్టాఫ్‌ కాలేజీలోనూ చదువుకున్నారు. యూనివర్సిటీ ఆఫ్‌ మద్రాసులో డిఫెన్స్‌ స్టడీస్‌లో ఎంఫిల్‌ పూర్తిచేశారు. 

1985 డిసెంబర్‌ 14న గర్వాల్‌ రైఫిల్స్‌ ఎనిమిదో బెటాలియన్‌లో చేరారు. అస్సాం, జమ్మూకశీ్మర్‌లో కీలకమైన సైనిక ఆపరేషన్లలో పాల్గొన్నారు. పశ్చిమ, ఉత్తర సరిహద్దులు, అక్కడి పరిస్థితులపై ఆయనకు గట్టి పట్టుంది. 2024 జూలై 1న వైస్‌ చీఫ్‌ ఆఫ్‌ ద ఆర్మీ స్టాఫ్‌గా నియమితులయ్యారు. 2025 జూలై 31 దాకా పనిచేశారు. విశిష్ట సేవా పతకం, పరమ విశిష్ట సేవా పతకంతో సహా ఎన్నో పతకాలు, పురస్కారాలు అందుకున్నారు. దేశంలో మొట్టమొదటి సీడీఎస్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ 2021 డిసెంబర్‌ 8న తమిళనాడులో హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. తర్వాత జనరల్‌ అనిల్‌ చౌహాన్‌ 2022 సెపె్టంబర్‌లో రెండో సీడీఎస్‌గా నియమితులయ్యా రు. లెఫ్టినెంట్‌ జనరల్‌ రాజా సుబ్రమణి భారత మూడో సీడీఎస్‌గా రికార్డుకెక్కబోతున్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement