నిర్జాష్ టీ స్టాల్‌: అక్కడి టీ ధర తెలిస్తే షాకే!

Kolkata Nirjash Tea Stall Serves Special Tea For Rs 1000 Per Cup - Sakshi

కొల్‌కతా: ఉదయాన్నే ఒక కప్పు టీ తాగనిదే చాలా మందికి ఆ రోజు ప్రారంభం కాదు. తలనొప్పి, పనిలో ఒత్తిడిగా అనిపించిన కప్పు టీ తాగితే క్షణాల్లో అవి మాయమైపోతాయి. అలాంటి ఒక కప్పు టీ ధర 10 రూపాయల నుంచి 20 రూపాయలు వరకు ఉంటుంది. ఇంకా స్పెషల్‌, వెరైటీ టీ అయితే రూ. 40 వరకు ఉంటుంది. కానీ ఇక్కడ ఒక కప్పు టీ ధర మాత్రం రూ. 1000 అంట. అలా అని అది ఏ స్టార్‌ హోటలో అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. అవును ఈ టీ షాపు పశ్చిమ బెంగాల్‌లోని ఓ రోడ్డు పక్కన ఉంటుంది. కొల్‌కతాకు చెందిన పార్థ ప్రతీం గంగూళీ అనే వ్యక్తి తన టీ స్టాల్‌లో వందకు పైగా వెరైటీ టీలను విక్రయిస్తున్నాడు.

వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో తయారు చేసే ఈ టీ ఆరోగ్యానికి కూడా చాలా మంచిదట. దీంతో ఈ టీ స్టాల్‌ అక్కడ చాలా ఫేమస్‌ అయ్యింది. కేవలం ఈ రాష్టం వారు మాత్రమే కాకుండా పక్క రాష్ట్రాల వారు కూడా ఇక్కడకు వచ్చి టీ తాగురంట. అయితే అంత రేటు పలికే ఈ టీ స్పెషాలిటీ ఏంటో తెలుసుకుందాం.. మొదట ప్రైవేట్ జాబ్ చేసుకునే గంగూళీ 2014లో నిర్జాష్‌‌ అనే పేరుతో ముకుంద్‌పూర్‌లో టీ స్టాల్ ప్రారంభించాడు. ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా లభించే 115 రకాల టీలు అందుబాటులో ఉంటాయి. కేజీకి రూ. 2.8 లక్షలు పలికే జపాన్‌ స్పెషల్ టీ సిల్వర్ నీడిల్ వైట్ టీ, రూ. 50వేలు నుంచి రూ. 32 లక్షల వరకు ధర పలికే ఉండే బో-లే టీ కూడా అభిస్తుంది. 

ఇక్కడ వెయ్యి రూపాయలకు అమ్మే ఆ టీ జపనీస్ వైట్ లీఫ్ టీగా పిలుస్తారు. ఈ ప్రీమియం టీకి వెయ్యి రూపాయలు అంత ఎక్కువ ధరేమీ కాదంటున్నాడు గంగూలీ. కానీ ఇక్కడ ఎక్కువ మంది మాత్రం మస్కటెల్ టీని తాగుతారంట. ఈ టీ తాగేందుకు చాలా మంది క్యూ కడుతుంటారు. ఇక ఈ టీ స్టాల్ మీదుగా వెళ్లే ప్రతి 1000 మందిలో 100 మంది ఖచ్చితంగా అక్కడ ఆగి టీ తాగుతారట. గంగూలీని చుట్టుపక్కల ప్రజలంతా ముద్దుగా 'పార్థ బాబూ' అని పిలుచుకుంటారట. అక్కడి స్థానికులు కొన్ని వెరైటీ టీలకు ముందుగానే ఇక్కడ అడ్వాన్స్ చెల్లిస్తుంటారంట. కేవలం టీ అమ్మడం మాత్రమే కాదు.. టీ పౌడర్‌ని కూడా గంగూలి విక్రయిస్తాడు. దేశవ్యాప్తంగా చాలా మంది టీ వ్యాపారులు గంగూలీ వద్ద ముడీ టీని తీసుకేళ్లుంటారని గంగూలీ చెప్పుకొస్తున్నాడు.  

చదవండి: ఆటోపై లగ్జరీ హౌజ్‌.. ఆనంద్‌ మహీంద్ర ఫిదా
కన్నీళ్లు తెప్పిస్తున్న డెలివరీ డ్రైవర్‌ దీన గాథ

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top