విరాట్‌ కోహ్లీ, తమన్నాకు హైకోర్టు నోటీసులు

Kerala HC sends notices to Virat Kohli and actors Tamannaah,Aju Varghese - Sakshi

ఆన్‌లైన్  రమ్మీ గేమ్స్‌: ‌ కోహ్లీ, తమన్నాలకు  కేరళ హైకోర్టు నోటీసులు..

సాక్షి, తిరువనంతపురం : ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్‌ గేమ్స్‌ వివాదంలో  టీమిండియా కెప్టెన్‌ విరాట్‌కోహ్లీ, టాలీవుడ్‌ నటి తమన్నా భాటియాకు మరోసారిఎదురు దెబ్బ తగిలింది.  వీరితోపాటు మాలీవుడ్‌ నటుడు అజు వర్గీస్‌కు కేరళ  హైకోర్టు నోటీసులు జారీ చేసింది.  రాష్ట్రంలో ఆన్‌లైన్ ‌రమ్మీ గేమ్స్‌కు బ్రాండ్‌ అంబాసిడర్స్‌గా వున్న వీరిని దీనిపై సమాధానం చెప్పాల్సిందిగా బుధవారం నోటీసులు జారీ చేసింది. త్రిసూర్‌కు చెందిన పోలీ వర్గీస్‌ ఈ గేమ్స్‌ను రద్దు చేయాల్సిందిగా కోరుతో హైకోర్టును ఆశ్రయించారు. ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ వెబ్‌సైట్లకు సెలబ్రిటీలు ప్రచారం చేయడాన్ని తప్పుపడుతూ, వీటిని రద్దుచేయాలని కోరుతూ కోర్టు కోర్టులో పిల్ దాఖలు చేశారు. దీన్ని విచారించిన కోర్టు తాజా నోటీసులు జారీ చేసింది.  అలాగే ఈ వ్యవహారంలో వివరణ ఇ‍వ్వాల్సిందిగా  రాష్ట్రప్రభుత్వాన్ని  హైకోర్టు ఆదేశించింది. 

కాగా  ఈ వివాదంలో పలువురు నటులుతోపాటు, క్రికెట్‌ సెలబ్రిటీలపై ఇప్పటికే మద్రాస్ హైకోర్టు సీరియస్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా వీటిపై కేరళ హైకోర్టు కూడా సీరియస్‌గా స్పందించింది. ఆన్‌లైన్ బెట్టింగ్ గేమ్స్‌‌కు అనుకూల ప్రకటనల్లో నటించిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ,  హీరోయిన్‌ తమన్నా, నటులు దగ్గుబాటి రానా, ప్రకాష్ రాజ్, సుదీప్‌లకు గత ఏడాది మద్రాస్  హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆన్‌లైన్ బెట్టింగ్ గేమ్స్ వల్ల ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారనంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు వాటిని ఎందుకు ప్రోత్సహిస్తారని నటులు, క్రికెటర్లను హైకోర్టు సూటిగా ప్రశ్నించింది. అంతేకాదు ఎందుకు వీటిపై ఎందుకు కఠిన చర్యలు తీసుకోవడం లేదంటూ తమిళనాడు ప్రభుత‍్వంపై కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top