Jharkhand Fire Accident: Jharkhand Dhanbad Massive Fire Kills Few - Sakshi
Sakshi News home page

జార్ఖండ్‌: ధన్‌బాద్‌లో ఘోరం.. 14 మంది సజీవ దహనం

Feb 1 2023 7:26 AM | Updated on Feb 1 2023 4:16 PM

Jharkhand Dhanbad Massive Fire Kills Few - Sakshi

ధన్‌బాద్‌ జిల్లాలోని ఓ బహుళ అంతస్థుల భవంతిలో జరిగిన అగ్నిప్రమాదంలో..

ధన్‌బాద్‌: జార్ఖండ్‌లోని ధన్‌బాద్‌ జిల్లాలోని ఓ బహుళ అంతస్థుల భవంతిలో జరిగిన అగ్నిప్రమాదంలో చిన్నారులు, మహిళలుసహా 14 మంది అగ్నికి ఆహుతయ్యారు. మంగళవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. జోరాఫాటక్‌ ప్రాంతంలోని ఆశీర్వాద్‌ టవర్‌ రెండో అంతస్తులో అంటుకున్న అగ్నికీలలు వేగంగా విస్తరించడంతో వీరంతా సజీవదహనమయ్యారు.

మరణించిన వారిలో ముగ్గురు చిన్నారులు, పది మంది మహిళలు ఉన్నారు. గాయపడిన 11 మందికి ఆస్పత్రిలో చికిత్సచేస్తున్నారు. ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉందని రాష్ట్ర చీఫ్‌ సెక్రటరీ సుఖ్‌దేవ్‌ సింగ్‌ చెప్పారు. మంటలు ఆర్పేందుకు 40 అగ్నిమాపక శకటాలు రంగంలోకి దిగాయి. అపార్ట్‌మెంట్‌లో ఇంకా కనీసం 50 మంది చిక్కుకుని ఉంటారని మాజీ ముఖ్యమంత్రి బాబూలాల్‌ మరాండీ ట్వీట్‌చేశారు.

పరిస్థితిని జిల్లా డెప్యూటీ కమిషనర్‌ స్వయంగా ఘటనాస్థలికొచ్చి పర్యవేక్షిస్తున్నారు. యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement