Indian Army Cheetah Helicopter Crashed In Arunachal Pradesh, Details Inside - Sakshi
Sakshi News home page

Arunachal Pradesh: కుప్పకూలిన భారత ఆర్మీ హెలిక్టాపర్‌.. పైలట్ల కోసం సెర్చ్‌ ఆపరేషన్‌!

Mar 16 2023 3:26 PM | Updated on Mar 16 2023 3:44 PM

Indian Army Cheetah Helicopter Crashed In Arunachal Pradesh - Sakshi

భారత సైన్యానికి చెందిన చిరుత హెలికాప్టర్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ప్రమాద ఘటనలో పైలట్ల కోసం గాలింపు చర్యలు చేపట్టారు ఆర్మీ అధికారులు. ఇక, ఈ ప్రమాదం ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్‌ ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. 

వివరాల ప్రకారం.. ఆర్మీకి చెందిన చిరుత హెలికాప్టర్‌ అరుణాచల్‌ ప్రదేశ్‌లోని మండాలా హిల్స్‌ వద్ద కుప్పకూలిపోయింది. బొండిలా పట్టణం నుంచి వెళ్తుండగా గురువారం 9.15 గంటలకు ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌తో సంబంధాలు కోల్పోయింది. దీంతో, వెంటనే అప్రమత్తమైన అధికారులు సెర్చ్‌ ఆపరేషన్‌ మొదలుపెట్టారు. హెలికాప్టర్‌లో ఉన్న ఇద్దరు పైలట్ల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు గువాహటి డిఫెన్స్ పీఆర్‌వో,  కల్నల్ మహేంద్ర రావత్  తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement