మామూలు డేరింగ్‌ కాదుగా.. వంతెన పైనుంచి గంగా నదిలో దూకి.. వీడియో వైరల్‌

Haryana Omwati Dives Into River Ganga From Bridge - Sakshi

సోషల్‌ మీడియా అనగానే ఎన్నో వింతలు, విశేషాలు కనిపిస్తుంటాయి. కొన్ని వినూత్న వీడియోలు, ఫన్నీలు నెటిజన్లను ఆకర్షిస్తుంటాయి. మరికొన్ని వీడియోలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. తాజాగా ఓ బామ్మ(73) చేసిన ఫీట్‌ సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. 

వివరాల ప్రకారం.. హర్యానాలోని సోంపేట్‌కు చెందిన ఓంవతి(73) హరిద్వార్‌లోని హర్ కీ పౌరి వద్ద 40 అడుగుల ఎత్తైన వంతెన పై నుంచి గంగా నదిలో దూకింది. ఆ తర్వాత నది అవతల ఒడ్డునకు ఈదుకుంటూ వెళ్లింది. ఆమె గంగా నదిలో దూకే సమయంలో కొందరు యువకులు ఆమెకు సహాయం అందించారు. అంత ఎత్తు నుంచి ఆమె నదిలో దూకడం అక్కడున్న వారందరినీ షాక్‌కు గురిచేసింది. 

కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. అనంతరం, ఓంవతి మాట్లాడుతూ.. తాను చిన్నప్పటి నుంచి నదుల్లో ఈత కొడుతున్నానని తెలిపింది. ఎత్తైనా వంతెనల నుంచి దూకి ఈత కొట్టడం అలవాటేనని పేర్కొంది. ఓంవతికి డ్యాన్స్ అంటే కూడా చాలా ఇష్టమని చెప్పింది. ఆమె డ్యాన్స్‌కు సంబంధించిన వీడియోలు కూడా వైరల్‌గా మారాయి. 

ఇది కూడా చదవండి: కప్పు ఛాయ్‌ రూ. 70 వసూలు! రైల్వే ప్యాసింజర్‌ షాక్‌.. రైల్వేస్‌ వివరణ

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top