పెళ్లి వేడుకలో వరుడికి దిమ్మతిరిగే షాకిచ్చిన వధువు‌.. వీడియో వైరల్‌

Groom Garlands Bride Slaps Man On Stage At Hamirpur - Sakshi

లక్నో: ప్రతీరోజు సోషల్‌ మీడియా వేదికగా ఎన్నో ఫన్నీ వీడియోలు చూస్తుంటాం. అందులో పెళ్లికి సంబంధించిన కపుల్స్‌ ఫన్నీ వీడియోలు చాలానే చూసి ఉంటారు. తాజాగా మరో వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాసేపట్లో పెళ్లి జరగబోతోందని అందరూ ఎంతో సంతోషంగా ఉండగా.. వరుడికి వధువు షాకిస్తూ అందరి ముందే చెంపచెళ్లుమనిపించింది. దీంతో వరుడికి దిమ్మతిరింది. 

వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్‌లో జరిగిన వివాహ వేడుకలో వధువు... వరుడి చెంప చెళ్లుమనిపించింది. పెళ్లి మండపంలో వరువు.. వధువు మెడలో పూల దండ వేవబోతుండగా.. ఆమె ఒక్కసారిగా పెళ్లికొడుకు చెంపపై కొట్టింది. ఏకంగా మూడు, నాలుగు సార్లు చెంపవాయిస్తూనే ఉంది. దీంతో అక్కడున్నా వారంతా షాకయ్యారు. అనంతరం ఆమె పెళ్లి మండపం దిగి వెళ్లిపోయింది. 

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. వధువుపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్‌ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. పెళ్లిలో వరుడు మద్యం సేవించి ఉండటం వల్లే ఆమె ఇలా చేసిందని ట‍్విట్టర్‌ యూజర్‌ తెలుపగా.. వధువుకు ఈ పెళ్లి ఇష్టంలేకనే అలా చేసిందని ఆమె బంధువులు చెబుతున్నారు. 

ఇది చదవండి: ఏపీలో టూరిస్ట్‌ స్పాట్‌గా ఉబ్బలమడుగు.. బ్రిటిష్‌ కాలంలో ఎంతో ఫేమస్‌

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top