అచ్చం సీఎం షిండేలా ఉన్నారే!.. ప్రముఖ వ్యాపారవేత్త ట్వీట్‌ వైరల్‌

Did You Know Which Industrialist Doppelganger To Maha CM Eknath Shinde - Sakshi

ముంబై: ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్‌ గోయెంకా.. సమకాలీన అంశాలపై త్వరగతిన సోషల్‌ మీడియా స్పందిస్తుంటారు. అదే టైంలో ఆయన నుంచి సరదా విషయాలు కూడా కొన్ని నెటిజన్లను ఆకట్టుకుంటాయి. ఫుడ్‌ వేస్టేజ్‌ విషయంలో బాధ్యతయుతంగా వ్యవహరించాలంటూ ఆయన ఇచ్చిన పిలుపు సైతం ఎంతోమందిని ఆకట్టుకుంది కూడా.

ఈ తరుణంలో తాజాగా ఆయన చేసిన ఓ ట్వీట్‌.. పలువురిని ఆకట్టుకుంటోంది. మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫొటోను.. ఆ పక్కనే తన బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫొటోను ఉంచి హర్ష్‌ గోయెంకా ఒక క్యాప్షన్‌ ఉంచారు.

‘నన్ను కలవడానికి వచ్చిన వారికి.. ఏదైనా సౌలభ్యం కోసం క్షమించండి. నా Z+ కేటగిరీ భద్రత ఇబ్బందిగా ఉంటుందని నాకు తెలుసు. మీ మద్దతు కోసం ఎదురు చూస్తున్నాను. జై మహారాష్ట్ర!’ అంటూ ఆయన ఓ ట్వీట్‌ చేశారు. సరదాగా చేసిన పోస్ట్‌ ఇప్పుడు రాజకీయ విశ్లేషకుడు తషీమ్‌ పూనావాలాతో పాటు ఎందరో నెటిజన్లను ఆ ఫొటోకు కామెంట్లు చేస్తున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top