పద్మ అవార్డులకు వైద్యుల పేర్లు

Delhi govt recommends names of three top doctors for Padma awards - Sakshi

న్యూఢిల్లీ: ఈ ఏడాది పద్మ అవార్డుల కోసం ఢిల్లీ ప్రభుత్వం ముగ్గురు వైద్యుల పేర్లను కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసిందని ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ శనివారం వెల్లడించారు. డాక్టర్‌లు ఎస్‌కే సరిన్, సురేశ్‌ కుమార్, సందీప్‌ బుధిరాజలు ఇందులో ఉన్నారని చెప్పారు. కోవిడ్‌ 19 పోరాటంలో భాగంగా వీరు చేసిన సేవలను గుర్తుంచుకొని పేర్లను సిఫారసు చేసినట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది కేవలం వైద్యుల పేర్లను మాత్రమే పంపాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

మొత్తం 9,427 మంది ప్రజలు కలసి 740 మంది పేర్లను సూచించారన్నారు. ఇందులో డాక్టర్లు, పారమెడిక్స్, ఇతర ఆరోగ్య రంగ నిపుణులు ఉన్నారన్నారు. ఇందులో ముగ్గురి పేర్లను డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా నేతృత్వంలోని కమిటీ ఖరారు చేసిందన్నారు. వారిలో ఐఎల్‌బీఎస్‌ వైస్‌ చాన్సలర్‌ డాక్టర్‌ ఎస్‌.కె సరిన్, ఎల్‌ఎన్‌జేపీ హాస్పిటల్స్‌ మెడికల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సురేశ్‌ కుమార్, గ్రూప్‌ మెడికల్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ మ్యాక్స్‌ హెల్త్‌ కేర్‌ గ్రూప్‌ డాక్టర్‌ సందీప్‌ బుధిరాజలు ఉన్నారని తెలిపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top