Chhattisgarh: హరేలీ పండుగ.. వెదురు బొంగులు కట్టుకుని సీఎం డ్యాన్స్‌..

Chhattisgarh CM Bhupesh Baghels Dance During Hareli Festival Celebrations Goes Viral - Sakshi

రాయ్‌పూర్‌: ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో ప్రజలు హరేలీ పండుగను ఉత్సాహంగా నిర్వహించారు. దీనిలో భాగంగా.. వ్యవసాయ పరికరాలు, ఆవులను, ప్రకృతిని ఆరాధించారు. కాగా, ప్రతి ఏడాది మాదిరిగా ఈసారి కూడా హరేలీ వేడుకను ఛత్తీస్‌గఢ్‌ ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఈ క్రమంలో, ఛత్తీస్‌ఘడ్‌ సీఎం భూపేష్‌ భగేల్‌ రాయ్‌పూర్‌లో జరిగిన హరేలీ వేడుకలలో పాల్గోని డ్యాన్స్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీనిలో భాగంగా.. సీఎం డప్పులు కొడుతూ.. సంప్రదాయ నృత్యం చేస్తూ స్థానికులలో మరింత ఉత్సాహాన్నినింపారు. 

ప్రధానంగా ఉత్తరాదిన, గోండ్‌ జాతి తెగలలో ఈ పండుగను ఘనంగా నిర్వహిస్తారు. ఈ రోజు రైతులు.. భెల్వా చెట్లకొమ్మలను, ఆకులను వారిపోలాల్లో వేస్తారు. మంచి పంట పండాలని కోరుకుంటారు.  అదే విధంగా, వేప కొమ్మలను తమ ఇంటి  గుమ్మాలకు వేలాడదీస్తారు. దీని వలన ఎలాంటి చీడలు ఇంట్లోకి రావని నమ్ముతారు.  అయితే, హరేలీలో ప్రధానంగా కాలికి వెదురు బొంగులు కట్టుకుని దాని సహయంతో నడుస్తారు. దీన్ని గేడిరేసు అని పిలుస్తారు. కాగా, సీఎం భూపేష్‌ భగేల్‌ కూడా తన కాళ్లకు వెదురు బొంగులు కట్టుకుని ఉత్సాహంగా గడిపారు.  ప్రజలతో కలిసి .. డ్యాన్స్‌ చేస్తూ సంతోషంగా గడిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top