వీడియో: ఇదెక్కడి కొట్లాటరా అయ్యా.. కారు ఢీకొని గాల్లోకి ఎగిరిపడ్డా తన్నుకోవడం ఆపలేదు!

Car Hit During A Brawl In Ghaziabad But They Wont Stop Fighting - Sakshi

లక్నో: నడి రోడ‍్డులో కొందరు విద్యార్థులు గొడవపడుతుండగా వేగంగా దూసుకొచ్చిన ఓ కారు.. ఇద్దరిని బలంగా ఢీకొట్టింది. దీంతో ఓ వ్యక్తి గాల్లోకి ఎగిరిపడ్డాడు. అంత వేగంగా కారు ఢీకొట్టినా.. అక్కడ గొడవ ఆగలేదు. ఏం జరిగినా తగ్గేదేలే అన్నట్లు గొడవ మరింత ఎక్కువైంది. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. కారు ఢీకొట్టిన దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాద్యమాల్లో వైరల్‌గా మారాయి. ఈ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని గాజియాబాద్‌ జిల్లాలో జరిగింది. 

వీడియో ప్రకారం.. కొందరు కళాశాల విద్యార్థులు రోడ్డుపై గొడపడుతున్నారు. అప్పుడే ఓ కారు వేగంగా దూసుకొచ్చింది. దానిని చూసి అంతా పక్కకు పరిగెట్టారు. కాని ఓ ఇద్దరు మాత్రం గమనించకపవటంతో వారిని కారు ఢీకొట్టింది. ఓ వ్యక్తి గాల్లోకి ఎగిరిపడ్డాడు. ఆ తర్వాత గొడవ మరింత ఎక్కువైంది. అయితే, కొద్ద సేపటికి.. పోలీసులు ఎంట‍్రీ ఇవ్వటంతో అక్కడి నుంచి పరారయ్యారు. పలువురు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నట్లు మసూరి పోలీస్‌ స్టేషన్‌ అధికారులు తెలిపారు. కారును సైతం సీజ్ చేసినట్లు చెప్పారు. ఈ ఘటనకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

ఇదీ చదవండి: ఎన్నికలకు ముందే బలమైన విపక్ష కూటమి: పవార్‌

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top