ప్రభుత్వ ఉద్యోగితో బీజేపీ నేత డిష్యూం డిష్యూం.. వీడియో వైరల్‌..

Uttar Pradesh Bjp Leader Pankaj Dixit Fight With Govt Officer - Sakshi

లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ బీజేపీ నేత పంకజ్ దీక్షిత్ ఓ ప్రభుత్వ ఉద్యోగితో గొడవపడ్డాడు. బారాబంకీలో నిర్వహించిన కృషి మేళాలో ఈ ఘటన జరిగింది. ప్రభుత్వ ఉద్యోగి అలోక్ సింగ్‌ బయట నుంచి క్యాబేజీ తెచ్చినందుకు ఆగ్రహించిన పంకజ్‌ సింగ్‌.. అతనితో ముష్టియుద్ధానికి దిగాడు. ఉద్యోగిపై దాడి చేసి కిందపడేశాడు. అనంతరం పలుమార్లు కొట్టాడు. చివరకు అక్కడున్నవారు కలుగజేసుకుని ఇద్దరినీ ఆపారు.

ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. పంకజ్ దీక్షిత్‌ మాత్రం తన చర్యను సమర్థించుకున్నాడు. ప్రభుత్వ ఉద్యోగి తనతో దురుసుగా ప్రవర్తించాడని ఆరోపించాడు. వీళ్లు తీరుమార్చుకోకపోతే మళ్లీ ఇలాగే చేస్తానని హెచ్చరించాడు.

చదవండి: ముంబైలోకి ప్రవేశించిన 'డేంజర్ మ్యాన్'.. చైనా, పాకిస్తాన్‌, హాంకాంగ్‌లో శిక్షణ..

మరిన్ని వార్తలు :

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top