విద్యార్ధిని కాపాడిన బ్రిటన్‌ రాయబారి | British DiplomAt Rescues College Student Who fell Into River In Chongqing China | Sakshi
Sakshi News home page

విద్యార్ధిని కాపాడిన బ్రిటన్‌ రాయబారి

Nov 17 2020 12:48 PM | Updated on Nov 17 2020 1:14 PM

British DiplomAt Rescues College Student Who fell Into River In Chongqing China - Sakshi

బీజింగ్‌: చైనాలో చాంగ్‌కింగ్‌లో ఒక విద్యార్ధిని ప్రమాదవశాత్తు నదిలో పడి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుండగా బ్రిటన్‌ రాయబారి స్టీఫన్‌ ఎల్లిసన్‌ నీటిలో దూకి కాపాడారు. ఈ కధనాన్ని చైనా అధికారిక వార్తా సంస్థ, బ్రిటన్‌ రాయబార కార్యాలయం వేర్వేరుగా వెల్లడించాయి. విద్యార్ధిని నీటిలో మునిగే సమయంలో అరుస్తుండగా ఎల్లిసన్‌ కాపాడుతున్న వీడియోను బ్రిటన్‌ కార్యాలయం ట్విట్టర్‌లో పోస్ట్‌ చేయగా బాగా వైరల్‌ అయింది.  వీక్షకులనుంచి విశేష స్పందన వచ్చింది. కాగా దీనిపై చైనా అధికారిక పత్రిక జిన్హులో "విద్యార్ధి త్వరగానే కోలుకుని స్పృహాలోకి వచ్చారు, శ్వాస కూడా యాథావిధిగా తీసుకోగలుగుతున్నట్లు.. రక్షించినందుకు ధన్యవాదాలు" అని ఆ విద్యార్థిని పేరును ప్రస్తావించకుండా కథనాన్ని ప్రచురించారు. ఇదే విషయం పై స్పందించిన బ్రిటన్‌ రాయబార కార్యాలయం ఎల్లిసన్‌ ధైర్యసహసం గురించి ప్రస్తావిస్తూ.. ఇది చూసి యావత్తు బ్రిటన్‌ ప్రజలు గర్వపడుతున్నట్లు తెలిపారు.

ఇదిలా ఉండగా గత కొద్ది నెలలుగా బ్రిటన్‌ -చైనా సంబంధాలు సన్నగిల్లాయి. దీనికి కారణం...156 ఏళ్ల బ్రిటీష్‌ పాలన తరువాత బీజింగ్‌ను తిరిగి అప్పగించిన  నుంచి హాంకాంగ్లో ప్రజాస్వామ్య నిరసనలను వెల్లువెత్తాయి వాటిని అరికట్టడానికి కొత్త జాతీయ భద్రతా చట్టాన్ని విధించాలన్న చైనా నిర్ణయంపై ఇరు దేశాల సంబంధాలు దెబ్బతిన్నాయి. గత కొద్ది నెలలుగా కరోనా కేసులు పెరుగుతుండటంతో చైనా తన సరిహద్దు దేశాలు సహా, బ్రిటన్‌ ప్రయాణికులును కూడా నవంబర్‌ 5 నుంచి తమ దేశానికి ప్రవేశాన్ని నిషేధించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement