
శ్రీనగర్: కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్ర సోమవారం జమ్మూ కశ్మీర్లో ముగియనుది. ఈ సందర్భంగా శ్రీనగర్‌లోని లాల్‌చౌక్ క్లాక్ టవర్ వద్ద అత్యంత కటుదిట్టమైన భద్రత నడుమ ఆయన ఆదివారం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ 1948లో ఇక్కడే జాతీయ పతాకాన్ని ఎగరేయడం విశేషం. రాహుల్ మాట్లాడుతూ దేశ ప్రజలకు తానిచ్చిన హామీని నెరవేర్చుకున్నానని చెప్పారు.
సెప్టెంబర్ 7న మొదలైన రాహుల్ భారత్ జోడో యాత్ర 12 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలు, 75 జిల్లాల మీదుగా 4 వేల కిలోమీటర్లను పూర్తి చేసుకుంది. మతసామరస్యమే ప్రధాన ఎజెండా సాగిన ఈ యాత్ర విజయవంతం కావడంతో రాహుల్ ఉల్లాసంగా కనిపించారు. సోమవారం ర్యాలీతో యాత్ర ముగుస్తుంది. ఈ సందర్భంగా శ్రీనగర్‌లోని ఎస్‌కే స్టేడియంలో జరిగే భారీ బహిరంగ సభకు 23 ప్రతిపక్ష పార్టీలను కాంగ్రెస్ ఆహ్వానించింది.
బీజేపీపై పోరుకు విపక్షాలు ఏకం
విపక్షాల మధ్య విభేదాలున్నా, బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌పై పోరులో అవి ఐక్యంగా ఉంటాయని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. జోడో యాత్రలో పాల్గొనబోమని టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ చెప్పడంపై ఆయన స్పందించారు. జోడో యాత్ర దక్షిణం నుంచి ఉత్తర భారతానికి చేరినప్పటికీ ఫలితం మాత్రం దేశమంతటా ఉందన్నారు. బీజేపీ–ఆర్‌ఎస్‌ఎస్‌ల విద్వేషం, అహంకారంల స్థానంలో తమ యాత్ర దేశానికి సోదరభావమనే ప్రత్యామ్నాయాన్ని చూపిందని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment