జలుక్‌బరి నుంచి హిమంత బిశ్వ శర్మ పోటీ | Assam BJP List Himanta Biswa Sarma from Jalukbari | Sakshi
Sakshi News home page

జలుక్‌బరి నుంచి పోటీ చేయనున్న అసోం సీఎం

Mar 20 2026 1:34 PM | Updated on Mar 20 2026 1:56 PM

Assam BJP List Himanta Biswa Sarma from Jalukbari

88 మందితో అసోం బీజేపీ తొలి జాబితా

న్యూఢిల్లీ: అసోం అసెంబ్లీ ఎన్నికల కోసం 88 మంది అభ్యర్థులతో కూడిన తన తొలి జాబితాను బీజేపీ గురువారం విడుదల చేసింది. ఈ జాబితాలో ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ పేరు కూడా ఉంది. జలుక్‌బరి నియోజకవర్గం నుంచి ఆయన బరిలోకి దిగనున్నారు. తొలి జాబితాలో 11 మంది ఎమ్మెల్యేలకు చోటు ద‌క్క‌లేదు.

బుధవారమే బీజేపీలో చేరిన కాంగ్రెస్‌ మాజీ నాయకుడు ప్రద్యుత్‌ బోర్డోలోయ్‌ను దిస్పూర్‌ అసెంబ్లీ స్థానం నుంచి తమ అభ్యర్థిగా పార్టీ ప్రకటించింది. కాంగ్రెస్‌ పార్టీని వీడి ఇటీవల బీజేపీలో చేరిన భూపేన్‌ కుమార్‌ బోరా, బిహ్‌పురా నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు.

అసెంబ్లీ స్పీకర్ బిశ్వజిత్ డైమరీ తముల్‌పూర్ నుంచి ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. జోర్హాట్ స్థానంలో మాజీ స్పీకర్ హితేంద్ర నాథ్ గోస్వామి, గౌరవ్ గోగోయ్‌తో తలపడనున్నారు. రాష్ట్ర మంత్రులు పిజూష్ హజారికా, జయంత మల్లా బారుహ్, అశోక్ సింఘాల్, అజంతా నియోగ్, చంద్రమోహన్ పట్వారీ, రూపేష్ గోవాలా తమ స్థానాలను నిలబెట్టుకున్నారు. హఫ్లాంగ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న నందితా గర్లోసా ఈసారి అక్కడ నుంచి బరిలోకి దిగడం లేదు. 

రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి సిద్ధార్థ భట్టాచార్యకు ఆయన ప్రస్తుత స్థానమైన గౌహతి తూర్పు నుంచి పోటీ చేసే అవ‌కాశం ద‌క్క‌లేదు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు అమియా కుమార్ భూయాన్ (బిహ్‌పురియా), అతుల్ బోరా (దిస్పూర్)లకు మొండిచేయి చూపారు. ఈ రెండు స్థానాల నుంచి ఫిరాయింపుదారులు బోరా, బోర్డోలోయ్‌ల‌కు టికెట్ ఇచ్చారు. కాగా,  అసోం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఏప్రిల్ 9న‌ జ‌ర‌గ‌నుంది. మే 4న ఫ‌లితాలు వెలువ‌డ‌తాయి.

చ‌ద‌వండి: కేరళ సీఎం విజయన్‌ ఆస్తులు ఎంతో తెలుసా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement