Anand Mahindra: రోబో కంటే వేగంగా దోశలు వేస్తున్నాడే..! | Anand Mahindra shares Dosa Man Video | Sakshi
Sakshi News home page

Anand Mahindra: రోబో కంటే వేగంగా దోశలు వేస్తున్నాడే..!

Aug 19 2021 8:51 PM | Updated on Aug 19 2021 9:24 PM

Anand Mahindra shares Dosa Man Video - Sakshi

ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్ర సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ అప్పుడప్పుడూ స్ఫూర్తిదాయకమైన, ఆసక్తికరమైన వీడియోలు షేర్ చేస్తూ ఉంటారు. మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్‌లో ఆసక్తికరమైన వీడియోలు, ఆలోచనాత్మక పోస్టులను తన అభిమానులతో షేర్ చేసుకుంటాడు. ఇటీవల మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్‌ మహీంద్ర ట్విటర్‌లో రోబో కంటే వేగంగా దోశను వేస్తున్న ఒక వ్యక్తి వీడియోను పంచుకున్నారు. మహీంద్రా ఆ వ్యక్తి అసాధారణ నైపుణ్యాలను ప్రశంసించారు.(చదవండి: ఖాతాదారులకు ఎస్‌బీఐ అలర్ట్!)

"ఈ పెద్దమనిషి రోబోట్ల కంటే వేగంగా దోశలు వేస్తున్నారు. నేను అతనిని చూస్తూ అలసిపోయాను.. అలాగే ఆకలిగా కూడా ఉంది" అని ట్విటర్‌ పోస్టులో రాశారు. మహీంద్రా @finetrait ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసిన వీడియోను ఇప్పటివరకు 25 లక్షల మంది చూడటంతో పాటు 30 వేల మంది లైక్ చేశారు. ఈ బిజినెస్ టైకూన్ ట్విటర్‌ అకౌంట్‌ ఆసక్తి వీడియోలకు గోల్డ్‌మైన్‌లా మారింది. ఆలోచనాత్మక పోస్ట్‌లతో అభిమానులు, ఫాలోవర్లను అలరించడం ఆనంద్‌ మహీంద్రాకు ఇష్టం. ఈ వీడియోలో దోశలు వేసే వ్యక్తి చాలా వేగంగా దోశలు వేస్తూ కస్టమర్లకు వేగంగా అందజేస్తున్నారు. అలాగే గత వారం ఆనంద్ మహీంద్రా ఒక మెషిన్ ద్వారా కొబ్బరి నీటిని సృజనాత్మకంగా విక్రయించే ఒక విక్రేతకు సంబంధించిన వీడియోను షేర్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement