నారాయణపేట రూరల్: జిల్లాలో పనిచేస్తున్న ఉపాధ్యాయ, ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్ చేయాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం జిల్లాశాఖ పక్షాన జెడ్పీ సీఈఓ శ్రీనివాస్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉద్యోగ విరమణ చేసిన ఉపాధ్యాయుల ఫైనల్ పేమెంట్‌తో పాటు పార్ట్ ఫైనల్ డబ్బులు సైతం వేగంగా చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు. జీపీఎఫ్ ఖాతాల నిర్వహణలో నిర్లక్ష్యం వహించొద్దని కోరారు. కాగా, ఈ విషయంపై సీఈఓ స్పందిస్తూ.. నెలరోజుల్లోగా ఆన్‌లైన్ ప్రక్రియను పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు నర్సింహ, కోశాధికారి కిషోర్ కుమార్, సహా కోశాధికారి శ్రీనివాస్, అశోక్, నర్సింహ, విశ్వేశ్వర్ పాల్గొన్నారు.


