బీసీలను దగా చేసిన కాంగ్రెస్
నారాయణపేట టౌన్: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం.. చివరకు 17 శాతం రిజర్వేషన్లతో దగా చేసిందని బీసీ జాగృతి సేన రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటేశ్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ భవన్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీ జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు అమలు చేయకపోవడం బాధాకరమన్నారు. బీసీలను నమ్మించి మో సం చేసిన పార్టీలను ప్రజాక్షేత్రంలోనే ఎండగట్టాలని ఆయన పిలుపునిచ్చారు. సమావేశంలో బీసీ జాగృతిసేన నాయకులు లక్ష్మీకాంత్‌రాజ్, ప్రవీ ణ్, కుమార్, నరేశ్, అశోక్, సాయితేజ్, రామకృష్ణ, నవీన్, బాలు, రామ్, రాజేందర్ ఉన్నారు.


