సీఎం పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు
మక్తల్: పట్టణ కేంద్రంలో డిసెంబర్ 1న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటన నేపథ్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యసహకార, క్రీడల యువజన పాడిపరిశ్రమల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. స్థానిక బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల సమీపంలో సీఎం సభా వేదిక, హెలిప్యాడ్, పార్కింగ్ తదితర ప్రాంతాలను శనివారం వారు పరిశీలించారు. మున్సిపల్, ఇతర శాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి ట్రాఫిక్, అత్యవసర సేవలు, ఫైర్ సేఫ్టీ లాంటివి అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. సభా వేదిక సమీపంలో భారీకేడ్లు ఉంచి, సీఎం మీటింగ్‌కు అవాంతరాలు లేకుండా చూడాలని సూచించారు. కార్యక్రమంలో డీఎస్పీ లింగయ్య, సీఐ రాంలాల్, కమిషనర్ శ్రీరామ్, ఎస్‌ఐ భాగ్యలక్ష్మీరెడ్డి తదితరులు ఉన్నారు.


