వారిదే పైచేయి..
ఇటీవల మద్యం దుకాణాలు సొంతం చేసుకున్న లైసెన్స్‌దారులకు రూ.లక్షలు ముట్టజెప్పి దుకాణాలు సొంతం చేసుకున్నారు కొందరు సిండికేట్ వ్యాపారులు. కోయిలకొండ దుకాణానికి ఏకంగా ఏకంగా రూ.1.50 కోట్ల గుడ్‌విల్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. బాగా డిమాండ్ ఉన్న దుకాణాలకు అయితే రూ.లక్షల్లో గుడ్‌విల్‌తోపాటు వ్యాపారంలో వాటాలు ఇచ్చినట్లు సమాచారం. మొత్తంగా మద్యం దుకాణాల్లో మళ్లీ లిక్కర్ కింగ్‌లదే పైచేయిగా మారింది. లక్కీడ్రా తీసినా బినామీ పేర్లతో దుకాణాలు కై వసం చేసుకున్నారు. ఒక్కో దుకాణానికి తమ అనుచరులు, పనిచేసే వ్యక్తులతో టెండర్లు వేయించి దుకాణాలు దక్కేలా వేసిన ఎత్తుగడలు ఫలించాయి. మరికొన్ని చోట్ల ఇతరులకు దుకాణాలు వచ్చినా గుడ్‌విల్ ఇస్తామంటూ బేరసారాలు చేసి రూ.లక్షల్లో ముట్టజెప్పి దుకాణాలు కై వసం చేసుకున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో అక్టోబర్ 27న మద్యం దుకాణాలకు లక్కీడిప్ తీసిన నాటి నుంచి ప్రత్యేక పథకాలు, పావులు కదిపి లిక్కర్ కింగ్‌లు పైచేయి సాధించారు. మద్యం వ్యాపారంలో ఎంత ఆదాయం ఉంటే ఇంత పోటీ ఉంటుందనేది ఆసక్తి రేకెత్తిస్తోంది.
జిల్లా మొత్తం దరఖాస్తులు ఫీజు
దుకాణాలు (రూ.కోట్లలో..)
మహబూబ్‌నగర్ 54 1,634 49.02
నాగర్‌కర్నూల్ 67 1,518 45.54
నారాయణపేట 36 853 25.59
జోగుళాంబ గద్వాల 34 774 23.22
వనపర్తి 36 757 22.71


