నామినేషన్ పత్రాలను నిశితంగా పరిశీలించాలి
కోస్గి రూరల్: స్థానిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా అభ్యర్ధులు వేసే ప్రతి నామినేషన్‌ను నిశితంగా పరీశీలించాలని జిల్లా ఎన్నికల పరిశీలకులు సీతాలక్ష్మి అధికారులకు ఆదేశించారు. శనివారం గుండుమాల్ మండలంలోని గుండుమాల్, బోగారం, కొమ్మూర్ క్లస్టర్లలో ఎన్నికల ప్రక్రియను పరీశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడతూ అభ్యర్థులు నామినేషన్ దాఖలు సమయంలో సమర్పించాల్సిన ధ్రువపత్రాల గురించి వారికి వివరించాలన్నారు. నామినేషన్ పత్రాలను సరి చూసి తప్పులు ఉంటే సరిచేసుకునే విధంగా సహకరించాలని అధికారులకు తెలియజేశారు. కార్యక్రమంలో ఎంపీడీఓ వేణుగోపాల్‌రెడ్డి తదితరులు ఉన్నారు.


