రాజ్యాంగ పరిరక్షణ
అందరి బాధ్యత
నారాయణపేట: రాజ్యాంగ పరిరక్షణ కోసం అందరూ తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని అడిషనల్ ఎస్పీ రియాజ్ హుల్ హక్ కోరారు. బుధవారం రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా ఎస్పీ కార్యాలయంలో భారత రాజ్యాంగ పీఠికను పోలీస్ అధికారులు చదివి, ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ.. 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగ సభ భారత రాజ్యాంగాన్ని అధికారికంగా ఆమోదించందన్నారు. దీంతో ప్రతి ఏటా నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటామని తెలిపారు. రాజ్యాంగాన్ని రూపొందించడంలో ప్రధాన పాత్ర పోషించిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సేవలు ఎప్పటికీ చిరస్మరణీయమన్నారు. ప్రజలకు న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం సౌభ్రాతృత్వం వంటి హక్కులను రాజ్యాంగ అందిస్తుందన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఐలు వెంకటేశ్వర్లు, శివశంకర్, నరేష్, పురుషోత్తం, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
విద్యుత్‌శాఖ ఎస్‌ఈగా నవీన్‌కుమార్ బాధ్యతలు
నారాయణపేట: విద్యుత్‌శాఖ ఎస్‌ఈగా నూతనంగా నియమితులైన నవీన్‌కుమార్ బుధవారం జిల్లా ఎస్‌ఈ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా విద్యుత్ శాఖ అధికారులు, 1104 యూనియన్ తరఫున సర్కిల్, డివిజన్ నాయకులు మొగులప్ప, శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో నూతన ఎస్‌ఈని మర్యాదపూర్వకంగా కలిసి శాలువా, పూలమాలతో సన్మానించారు. కార్యక్రమంలో డీఈ నర్సింహారావు, డీఈటీ జితేందర్, ఏడీ సుధారాణి, మహబుబ్‌నగర్ ఏడీ చంద్రశేఖర్, జడ్చర్ల నవీన్‌కుమార్, ఏఈ వెంకట్‌నారాయణ, ఏఈటీ వెంకట్రాంరెడ్డి, కాంట్రాక్టర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పోలెమోని కృష్ణ, కాంట్రాక్టర్ కతాల్ అహామ్మద్, మోనోద్దీన్, తిప్రాస్‌పల్లి కృష్ణ, అశోక్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
రైతు, ప్రజా వ్యతిరేక
విధానాలు సరికాదు
నారాయణపేట టౌన్: కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఎస్‌కేఎమ్ నాయకులు డిమాండ్ చేశారు. సంయుక్త కిసాన్ మోర్చా జాతీయ కమిటీ పిలుపులో భాగంగా జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ కూడలిలో బుధవారం బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ అనుకూల, రైతు ప్రజా వ్యతిరేక విధానాలను విడనాడాలని నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమానికి ఏఐయూకేఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి యాదగిరి, ఏఐకేఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి అధ్య క్షత వహించారు. ముఖ్య వక్తలుగా విచ్చేసిన సీపీఎం జిల్లా కార్యదర్శి, అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షు డు అబ్దుల్‌సలీ మాట్లాడుతూ.. 2021 డిసెంబర్ 9న సంయుక్త కిసాన్ మోర్చా నాయకుల కు, రైతులకు క్షమాపణ చెప్తూ ప్రధాని మోదీ రాతపూర్వకంగా ఇచ్చిన హామీను అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో సీపీఐ ఎంఎల్ మాస్‌లైన్ డివిజన్ కార్యదర్శి కాశీనాథ్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గోపాల్, ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి జయలక్ష్మి, రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కొండ నర్సిములు తదితరులు పాల్గొన్నారు.
రాజ్యాంగ పరిరక్షణ
రాజ్యాంగ పరిరక్షణ


