పోస్టర్ డిజైన్‌లో ప్రతిభ
మిడ్జిల్: తెలంగాణ రాజ్ భవన్ ఆధ్వర్యంలో చేపట్టిన ‘తెలంగాణ ఉత్తర– తూర్పు కాంటెస్ట్’ కోసం నిర్వహించిన పోస్టర్ డిజైన్ పోటీల్లో మిడ్జిల్ మండలం బోయిన్‌పల్లికి చెందిన విష్ణువర్ధన్ అత్యుత్తమ ప్రతిభ చాటారు. రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన పోస్టర్ల కంటే విష్ణువర్ధన్ రూపొందించిన పోస్టర్ ఆకర్షణీయంగా ఉండటంతో ఆదివారం రాజ్ భవన్‌లో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అభినందించి.. ప్రశంసాపత్రం, నగదు బహుమతి అందజేశారు. తెలంగాణ ఉత్తర–తూర్పు ప్రాంతాల్లో సాంస్కృతిక మార్పు, వ్యాపార అనుబంధం, విద్య, ఉపాధి అవకాశాలు వంటి అంశాలను బలోపేతం చేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని విష్ణువర్ధన్ తెలిపారు. ఈ అంశాన్ని ఆకర్షణీయంగా, సందేశాత్మకంగా ప్రతిబింబించినందుకు తన పోస్టర్ డిజైన్‌ను ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు.
బోయిన్‌పల్లి యువకుడికి
గవర్నర్ ప్రశంస


