భక్తి పారవశ్యంతో ఉన్నప్పుడే విముక్తి
● అంతర్జాతీయ యోగా శిక్షణ నిపుణులు ఆధ్మాత్మిక ధర్మ ప్రచారకులు రహెత్తమాచార్య
● ఉమామహేశ్వర ఆలయంలో దీపోత్సవం
మక్తల్: ప్రతి ఒక్కరూ భక్తిమార్గంలో ఉన్నప్పుడే విముక్తి ఉంటుందని అంతర్జాతీయ యోగా శిక్షణ నిపుణుడు ఆధ్మాత్మిక ధర్మ ప్రచారకులు రహెత్తమాచార్య అన్నారు. గురువారం పట్టణంలోని ఉమామహేశ్వర ఆలయంలో ముక్కంటి దీపోత్సవం 33,333 కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉమామహేశ్వర ఆలయం నుంచి అజాద్‌నగర్ చౌరస్తా వరకు దీపాలు వెలిగించారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రహెత్తమాచార్యులు మాట్లాడుతూ ప్రతి మనిషి తనలో జ్ఞాన దీపాలను వెలిగించాలని, కార్తీక మాసంలో సాన దీపారాధన, ఉపవాస వనభోజనాలకు ప్రసిద్ధి అని అన్నారు. పరమశివుడికి ప్రీతిపాత్రమైన జ్యోతిని వెలగించడం ద్వారా సకల పుణ్యాలు సిద్ధిస్తాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో మంత్రి వాకిటి శ్రీహరి సతీమణి వాకిటి లలితమ్మ, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొండయ్య, అర్బన్ అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి, కట్ట సురేష్, కోళ్ల వెంకటేష్, రవికుమార్, అంజనేయులు, సూర్యఅంజి తదితరులు పాల్గొన్నారు.
ఆలయాల్లో..
పట్టణంలోని మల్లికార్జునస్వామి ఆలయం, పడమటి ఆంజనేయస్వామి ఆలయం, ఉమామహేశ్వరాలయం, వేణుగోపాలస్వామి, షిర్డిసాయి ఆలయంలో భక్తులు పెద్ద సంఖ్యలో పూజలు నిర్వహించారు. ఆయా ఆలయాల వద్ద దీపోత్సవం కార్యక్రమం నిర్వహించారు.
భక్తి పారవశ్యంతో ఉన్నప్పుడే విముక్తి


