ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి..
జిల్లాలో కూరగాయల సాగు పెద్దగా లేకపోవడంతో ఏపీలోని కర్నూలు, హైదరాబాద్ – శంషాబాద్, కర్ణాటకలోని రాయచూర్ ప్రాంతాల నుంచి కూరగాయలను దిగుమతి చేసుకుంటున్నాం. అక్కడ కూరగాయల ధరలు పెరగడంతో ఇక్కడ వాటి ధరలు అమాంతం పెరుగుతున్నాయి.
– చిట్టెమ్మ, కూరగాయల వ్యాపారి, మరికల్
అధిక వర్షాలతో కూరగాయల తోటలు దెబ్బతినడంతో మార్కెట్‌లో ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో ఏ కూరగాయ కొనాలన్నా కిలోకు రూ.80 నుంచి రూ.100 వరకు వ్యాపారులు విక్రయిస్తున్నారు. నెలరోజుల క్రితం రూ.200 తీసుకెళ్తే బస్తా నిండా కూరగాయలు వచ్చేవి. ఇప్పుడు రూ.500 తీసుకెళ్లినా బస్తా నిండటం లేదు. దీంతో చేసేదేమి లేక టమాటా చారుతో పొద్దు గడుపుతున్నాం. – ఎల్లప్ప, మరికల్
మాకు ఉన్న అరెకరా పొలంలో బెండకాయ, బీరకాయ, వంకాయ, పచ్చిమిర్చిని సాగుచేశాం. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తోటలన్నీ పాడయ్యాయి. తీరా ఇప్పుడు మార్కెట్‌లో కూరగాయలు కొనాలని పోతే రేట్లు బాగా పెరిగాయి. రోజు పప్పు, పచ్చళ్లతో సరిపెట్టుకుంటున్నాం.
– అనసూయ, మద్దెల్‌బీడు
ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి..
ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి..


