
పదోన్నతితో మరింత బాధ్యత : ఎస్పీ
నారాయణపేట క్రైం: ఉద్యోగులకు కల్పించే పదోన్నతులు మరిన్ని బాధ్యతలు పెంచుతాయని ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు. జిల్లా పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో ఏఆర్ కానిస్టేబుల్‌గా పనిచేస్తూ హెడ్ కానిస్టేబుల్‌గా పదోన్నతి పొందిన భద్రూ నాయక్ సోమవారం ఎస్పీని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పదోన్నతి పొందిన హెడ్ కానిస్టేబుల్‌ను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. నూతనోత్సాహంతో పనిచేస్తూ.. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. కార్యక్రమంలో ఏఎస్పీ రియాజ్ హుల్ హక్, ఆర్‌ఐ నర్సింహ పాల్గొన్నారు.
● జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఎస్పీ యోగేష్ గౌతమ్ పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై ఆరు అర్జీలు అందజేయగా.. వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీసు అధికారులకు ఎస్పీ సూచించారు. ప్రజలకు పోలీసు శాఖను మరింత చేరువ చేయడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. సమస్యలపై పోలీస్‌స్టేషన్‌కు వచ్చే బాధితులతో మర్యాద పూర్వకంగా వ్యవహరించి భరోసాగా కల్పించాలని తెలిపారు. పోలీసుల వద్దకు వచ్చే ఫిర్యాదుదారులు మధ్యవర్తులను తీసుకురావొద్దని.. బాధితులు నేరుగా సంప్రదించాలని ఎస్పీ సూచించారు.