
కుటుంబ పోషణ భారం..
నాలుగు నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో కుటుంబాలు గడవడం కష్టమవుతోంది. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం. ఇటీవల జరిగిన ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమంలో రెగ్యులర్ ఉపాధ్యాయులతో పాటు ఐదు రోజులు పాల్గొన్నాం. ప్రభుత్వం వెంటనే వేతన బకాయిలు విడుదల చేసి ఆదుకోవాలి.
– శ్రీనివాస్, బండగొండ
వేతనాలు ఇవ్వాలి..
చేస్తున్న ఉద్యోగం మానేసి పాఠశాలలో చేరా. ఇప్పటి వరకు వేతనాలు చెల్లించకపోగా.. ఏప్రిల్ 23న టెర్మినేట్ చేశారు. మిగాతా కాంట్రాక్టు ఉద్యోగ, ఉపాధ్యాయులను మూడురోజుల్లో విధుల్లోకి తీసుకున్నారు. ప్రభుత్వం మా ఆవేదనను అర్థం చేసుకొని వేతనాలు చెల్లించాలి.
– మాధవీలత, కున్సి
పెండింగ్లో ఉన్నాయి..
డీఎస్సీ–2008 కాంట్రాక్టు ఉపాధ్యాయుల వేతనాల అంశం రాష్ట్రస్థాయిలో ఉంది. జిల్లాలో 41 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరందరికి నాలుగు నెలల వేతనాలు చెల్లించాల్సి ఉంది. వేతనాలు, సర్వీసు పునరుద్ధరణ విషయాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం.
– గోవిందరాజులు, జిల్లా విద్యాధికారి
●

కుటుంబ పోషణ భారం..

కుటుంబ పోషణ భారం..