
ఉపాధ్యాయుల చేతుల్లోనే విద్యార్థుల భవిష్యత్
నారాయణపేట: ఉపాధ్యాయుల చేతుల్లోనే విద్యార్థుల భవిష్యత్ ఉంటుందని, ప్రతి ఉపాధ్యాయుడు వృత్యంతర శిక్షణలో అందిస్తున్న విషయాలను ఆకలింపు చేసుకొని తరగతి గదిలో విద్యార్థులకు అర్థమయ్యేలా సులభతర బోధనా విధానాలు అమలు చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో బాలికల సాంఘిక సంక్షేమ పాఠశాలలో నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల వృత్యంతర శిక్షణ కార్యక్రమాన్ని బుధవారం కలెక్టర్ పరిశీలించారు. స్పెషల్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయులనుద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలపై సాధారణ ఉపాధ్యాయులకు అవగాహన కల్పించాలన్నారు. విద్యార్థులకు అన్ని సౌలభ్యాలను అందించేందుకు నిబద్దతతో పనిచేయాలన్నారు. ఉర్ధూ మాద్యమ ఉపాధ్యాయులతో కలెక్టర్ ముచ్చటించారు. గతంలో అమలుపరిచిన రోహిణి (వెలుగు..అభ్యసమిత్ర) వర్క్ పుస్తకాలను జిల్లా వ్యాప్తంగా మరో మారు అమలుపరిస్తే విద్యార్థుల సామర్థ్యాలు తప్పనిసరిగా మెరగవుతాయని ఉపాధ్యాయులు సూచించారు. దీనికి కలెక్టర్‌ను పూర్తిగా సహకరిస్తానని తప్పనిసరిగా అటువంటి వర్క్ బుక్‌లను వెంటనే వినియోగంలోకి తెచ్చేలా, ప్రింట్ డిస్ట్రిబ్యూట్ చేసేలా చర్యలు తీసుకోవాలని డీఈఓను ఆదేశించారు. ఈ శిక్షణ కార్యక్రమాలు శాఖపరమైన పనితీరు మెరుగుపరచుకోవడంతో పాటు విద్యార్థుల అవగాహన నేర్చుకునే సామర్థ్యాలను మరింత సులభతరం చేసేలా బోధన విధా నాలు నేర్చుకునేందుకు ఉపయోగపడతాయన్నారు. శిక్షణకు గైర్హాజర్ అయిన వారిని వెంటనే హజరు కావాల్సిందిగా ఆదేశిస్తూ తగు చర్యలు చేపట్టమని డీఈఓను ఆదేశించారు. కలెక్టర్‌తో పాటు డీఈఓ గోవిందరాజులు, కోర్సు కో ఆర్డినేటర్ మహ్మద్ సిరాజుద్దీన్, ఎఎంఓ విద్యాసాగర్‌లు ఉన్నారు.
నర్సింగ్ కళాశాల నిర్మాణ పనులు ప్రారంభించాలి
నారాయణపేట మండలంలోని అప్పక్‌పల్లి సమీపంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కళాశాలను కలెక్టర్ సందర్శించారు. మెడికల్ కళాశాల ఆవరణలో రూ.26 కోట్ల వ్యయంతో నిర్మించబోయే నర్సింగ్ కళాశాల కోసం స్థలాన్ని, అలాగే రూ.24 కోట్లతో నిర్మించే ఎంసీహెచ్ (మదర్ అండ్ చైల్డ్ హెల్త్ ) సెంటర్ స్థలాన్ని పరిశీలించారు. ఎంసిహెచ్, నర్సింగ్ కళాశాల నిర్మాణ పనులను వీలైనంత త్వరగా ప్రారంభించాలని టీజీఎంఎస్‌ఐడీసీఈఈ రాజేందర్‌ను ఆదేశించారు. అనంతరం మెడికల్ కళాశాల, నర్సింగ్ కళాశాల విద్యార్థినులతో మాట్లాడారు. విద్యార్థినులు భోజనం సరిగ్గా ఉండటం లేదని కలెక్టర్ దృష్టికి తీసుకురాగా.. వంట ఏజెన్సీ వారితో మాట్లాడి నాణ్యమైన భోజనాన్ని అందించేలా చర్యలు తీసుకోవాలని కళాశాల ప్రిన్సిపల్‌కు సూచించారు. ఇదిలాఉండగా, సీఎం రేవంత్‌రెడ్డి ఫిబ్రవరి 21న అప్పక్‌పల్లిలో భూమి పూజ చేసిన ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించి నిర్మాణ పనులను వేగంగా చేయించాలని ఇంటి యజమానిని, హౌసింగ్ పిడి శంకర్‌ను ఆదేశించారు. అలాగే సింగారం చౌరస్తాలో జిల్లా మహిళ సమాఖ్య ఆధ్వర్యంలో నడుస్తున్న పెట్రోల్ బంక్‌ను కలెక్టర్ పరిశీలించి ఆర్థిక లావాదేవీల రికార్డులను పరిశీలించారు. కలెక్టర్‌తో పాటు డీఆర్‌డీఓ మొగులప్ప, డిజిఎంఎస్‌ఐడిసిడీఈ కృష్ణమూర్తి, ఏఈ సాయి మురారి, ఎంపిడిఓ సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.