
జిల్లా కేంద్రాలు సేకరించిన రావాల్సిన సన్నరకం ధాన్యం బో
జిల్లాల వారీగా ధాన్యం సేకరణ ఇలా..
పెరిగిన సన్నాల సాగు..
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సన్నరకం వరి సాగు భారీగా పెరిగింది. సాధారణంగా ఇక్కడి రైతులు వానాకాలం సీజన్‌లో సన్నాలు, యాసంగిలో దొడ్డు రకం పండిస్తారు. అయితే ప్రభుత్వం సన్నాలకు రూ.500 చొప్పున బోనస్ ఇస్తామని ప్రకటించడంతో యాసంగి సీజన్‌లోనూ రైతులు సన్నాల సాగుకే మొగ్గు చూపుతున్నారు. నారాయణపేట జిల్లాలో ఇప్పటి వరకు 1.13 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించగా, ఇందులో ఏకంగా 86,369 మెట్రిక్ టన్నులు సన్నాలే కావడం గమనార్హం. మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, జోగుళాంబ గద్వాల జిల్లాల్లోనూ ఇప్పటి వరకు దొడ్డు రకం కంటే.. సన్నాలే ఎక్కువగా కొనుగోలు కేంద్రాలకు వచ్చింది. అయితే కేవలం రెండు రోజుల్లోనే రైతులకు పూర్తిస్థాయిలో ధాన్యం డబ్బులు పడుతాయని అధికారులు చెబుతున్నా ఎక్కడా అమలు కావడం లేదు. కనీస మద్ధతు ధర ప్రకారం ధాన్యం డబ్బులు జమయ్యేందుకు కనీసం వారం రోజులు పడుతుండగా, రూ.500 చొప్పున ప్రభుత్వం ఇచ్చే బోనస్ డబ్బులు 15 రోజులు దాటినా పడటం లేదని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి సకాలంలో బోనస్ డబ్బులు ఖాతాల్లో జమచేయాలని వేడుకుంటున్నారు.
ప్రజాప్రతినిధులు చెప్పడంతోనే..
నేను ఈ యాసంగిలో 8 ఎకరాలల్లో 415 బస్తాలు వరి ధాన్యం పండించాం. అందుకుగాను రూ.3.80 లక్షలకుపైగా నగదు వచ్చింది. నాయకులు, అధికారులు ముందుగా రైతులకు ధాన్యం డబ్బులతో పాటుగా బోనస్ రూ. 500 వేస్తానని అన్నారు. బోనస్ వస్తుందనే ఆశతోనే నేను నా ధాన్యంను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాను. కానీ, నేటికీ బోనస్ అందలేదు.
– బవకోళ మారెప్ప, రైతు, మాగనూర్, నారాయణపేట జిల్లా
ఎదురుచూస్తున్నాం..
నేను మాగనూర్ గ్రామ శివారులో 11 ఎకరాల్లో వరి సాగు చేశాను. 288 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. పది రోజుల క్రితం నేను మాగనూర్ పీఏసీఎస్ కేంద్రంలో ధాన్యం విక్రయించాను. క్వింటాల్‌కు రూ. 500 బోనస్ చొప్పున మొత్తం రూ.1.44 లక్షలు బోనస్ రావాలి. ఇన్ని రోజులు గడుస్తున్నా బోనస్ డబ్బులు రాలేదు. బోనస్ డబ్బుల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నాం.
– అంజప్ప, రైతు, మాగనూర్, నారాయణపేట జిల్లా
●

జిల్లా కేంద్రాలు సేకరించిన రావాల్సిన సన్నరకం ధాన్యం బో