
బ్యాంకు చుట్టూ తిరుగుతున్నాం
15 రోజుల క్రితం 145 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు కేంద్రంలో విక్రయించాం. నాలుగు రోజుల్లో బోనస్ కాకుండా మిగితా డబ్బులు బ్యాంకు ఖాతాలో జమ చేశారు. మరో వారంలో బోనస్ కూడా పడుతుందన్నారు. కానీ 15 రోజులైన బోనస్ రాకోపోవడంతో బ్యాంకు అధికారుల చుట్టూ తిరుగుతున్నాం. బోనస్ కింద రూ.74 వేలు రావాల్సింది.
– వెంకట్‌రెడ్డి, రైతు, కన్మనూర్, మరికల్ మండలం, నారాయణపేట జిల్లా
అధికారులు సైతం
తెలియదంటున్నారు
50 క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు కేంద్రంలో విక్రయించాం. ధాన్యం వేసి 25 రోజులు అవుతుంది. ఇంత వరకు బోనస్‌కు సంబందించి రూ.25 వేలు రావాల్సింది. బోనస్ డబ్బులు ఎప్పుడు వేస్తారని అధికారులను సంప్రదిస్తే.. తమకు తెలియదని సమాధానమిచ్చారు. అసలు బోనస్ వస్తుందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
– చెన్నప్ప, రైతు, కన్మనూర్,
మరికల్ మండలం, నారాయణపేట జిల్లా
ఒకట్రెండు రోజుల్లో
బోనస్ డబ్బులు
ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేస్తున్నాం. ఇప్పటి వరకు రైతుల నుంచి 59,785 మెట్రిక్ టన్నుల సన్నరకం ధాన్యం కొనుగోలు చేసి సంబంధిత రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు కూడా జమ చేయడం జరిగింది. ఒకటి, రెండు రోజుల్లో రూ.8.88 కోట్లు బోనస్ డబ్బులు కూడా జమ చేస్తాం. మద్దతు ధరతో ప్రతిఒక్క గింజనూ కొనుగోలు చేస్తాం. రైతులు దళారులను నమ్మి తక్కువ ధరకు ధాన్యాన్ని విక్రయించి నష్టపోవద్దు. డబ్బులు రైతుల ఖాతాల్లోనే జమ చేస్తాం.
– రవినాయక్, మేనేజర్, జిల్లా
పౌర సరఫరాల సంస్థ, మహబూబ్‌నగర్
●

బ్యాంకు చుట్టూ తిరుగుతున్నాం

బ్యాంకు చుట్టూ తిరుగుతున్నాం