రికార్డుల నిర్వహణపై అడిషనల్‌ కలెక్టర్‌ ఆగ్రహం | - | Sakshi
Sakshi News home page

రికార్డుల నిర్వహణపై అడిషనల్‌ కలెక్టర్‌ ఆగ్రహం

Apr 27 2025 12:26 AM | Updated on Apr 27 2025 12:26 AM

రికార్డుల నిర్వహణపై అడిషనల్‌ కలెక్టర్‌ ఆగ్రహం

రికార్డుల నిర్వహణపై అడిషనల్‌ కలెక్టర్‌ ఆగ్రహం

ధన్వాడ: గన్నీ బ్యాగులు తక్కువ ఉన్నాయని చెబుతున్నారు కానీ రికార్డు ప్రకారం ఇంక మీ వద్ద 50వేల బ్యాగులు ఉండాలి.. ఎక్కడ ఉన్నాయి.. రికార్డుల నిర్వహణ సక్రమంగా చేపడితే ఇలాంటి పొరపాట్లు జరగవు కదా అని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధికారులపై అడిషనల్‌ కలెక్టర్‌ బేన్‌ షేలం ఆగ్రహం వ్యక్తం చేశారు. గన్నీ బ్యాగుల కొరత ఉందని తెలియడంతో శనివారం ధన్వాడ సింగిల్‌విండో కార్యాలయాన్ని ఆయన సందర్శించి అధికారులతో వివరాలు సేకరించారు. ఇప్పటివరకు 73వేల గన్నీ బ్యాగులు వచ్చాయని, 80వేల క్వింటాళ్ల ధాన్యం సేకరించామని తెలిపారు. దీంతో 80వేల క్వింటాళ్లకు 20వేల బ్యాగులు సరిపోతాయని, మిగతా బ్యాగులు ఎక్కడ ఉన్నాయి, ఇలా తప్పుడు లెక్కలు రాస్తూ, ఇష్టానుసారంగా వ్యవహిరిస్తే రైతులు ఇబ్బందులు పడరా అని ప్రశ్నించారు. అనంతరం గోటూర్‌లో కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. వారం రోజులుగా లారీలు రాకపోవడంతో ఎదురుచూస్తున్నామని రైతులు తెలపగా.. వెంటనే లారీలను ఏర్పాటు చేయాలని సివిల్‌ సప్లె అధికారులకు సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement