
అజ్మీర్ దర్గాను దర్శించుకున్న ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి
నారాయణపేట: రాజస్థాన్ రాష్ట్రంలోని అజ్మీర్ షరీఫ్ దర్గాను శుక్రవారం నారాయణపేట ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి సతీమణి స్వాతిరెడ్డితో కలిసి దర్శించుకున్నారు. నారాయణపేట జిల్లాకు చెందిన బీఆర్‌ఎస్ మైనార్టీ నాయకులు ముందుగానే అక్కడికి చేరుకున్నారు. ఎమ్మెల్యే అజ్మీర్ దర్గాకు చేరుకోవడంతో మైనార్టీ నాయకులు ఎమ్మెల్యే దంపతులకు ఘన స్వాగతం పలికారు. దర్గాలో ఎమ్మెల్యే చాదర్‌ను సమర్పించి నారాయణపేట జిల్లా, నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని కోరుతూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఎమ్మెల్యేతో పాటు దర్గాను దర్శించుకున్న వారిలో పేట మైనార్టీ బీఆర్‌ఎస్ అధ్యక్షుడు మహిమూద్, 23వ వార్డు కౌన్సిలర్ తఖీచాంద్, మైనార్టీ నాయకులు దస్తగీర్‌చాంద్, తాజుద్దీన్, మహ్మద్‌తఖీ ముజిన్, రియాజుద్దీన్ రంగ్రెజ్, మహ్మద్ చాంద్‌పాషా తదితరులు ఉన్నారు.
సమాచారం నిక్షిప్తం
● జిల్లాలో 381 పాఠశాలలకు అందనున్న 449 ట్యాబ్‌లు
● విద్యార్థుల సంఖ్య ఆధారంగా పంపిణీ
● త్వరలో ఉపాధ్యాయులకు శిక్షణ